Breaking News

శ్రీకృష్ణ మందిరంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన యేదుపాటి రామయ్య

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఈరోజు భవానీ పురం పరిధిలోని శ్రీకృష్ణ మందిరంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, ఆలయ శుద్ధి అనంతరం పూజా కార్యక్రమం నిర్వహించిన క్లస్టర్ ఇంచార్జి యేదుపాటి రామయ్య, కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రామయ్య మాట్లాడుతూగత ప్రభుత్వ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానము లో కల్తీ లడ్డు వల్ల ఆలయ ప్రతిష్ట ను బ్రష్టు పట్టించారనీ ప్రపంచ దేశాలలో కలియుగ దైవము మన ఏడుకొండలు స్వామి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తెలిపారు.

పశ్చిమ బీసీ సెల్ ప్రెసిడెంట్ శివాజీ మాట్లాడుతూ కల్తీ నెయ్యి కల్తీ మద్యం ఇలా ప్రజలు మనోభావాలను దెబ్బతీసే , ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారని సైకో పరిపాలన పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి విధానాలు ప్రజలు గమనిస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో యూనిట్ ఇంచార్జీ స్రవంతి, పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఆలీ, కో యూనిట్ ఇంచార్జి కాకోల్లు సురేష్, బూత్ ఇంచార్జీ నెలకుర్తి వెంకట్రావు, సతీష్, కాళిదాసు, అందే మేరీ, శివ, ఆటో యూనియన్ నాయకులు హనుమంతు, కమిటీ సభ్యులు బోయపాటి శ్రీను, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *