-ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కలిపి జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రూ.128.43 కోట్లను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసింది వీటిని వచ్చే నెల 20వ తేదీ నాటికి ఖర్చు పెట్టాలని స్పష్టంచేసింది. గరిష్టంగా గుంటూరు జిల్లాకు రూ.26.1 కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.8.60 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ.6.21 కోట్ల చొప్పున ఎన్హెచ్ఎం బడ్జెట్లో చివరి విడత కింద (2025-26) విడుదల చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు మిగిలిన జిల్లాలకు గరిష్టంగా రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున పంపించినట్లు తెలిపారు. మంగళగిరిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం జిల్లా vaidya arogya అధికారులతో జరిగిన సమావేశం (వర్చువల్)లో వీరపాండియన్ మార్గదర్శకాలు అనుసరించి నిధులను ఖర్చుపెట్టి, వివరాలు సమర్పించాలని స్పష్టంచేశారు.
Prajavartha Online Telugu News