-ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్
-బుద్దు వారి గుడి చైర్మన్ పిళ్లా సుదర్శన్ ఆధ్వర్యంలో శుద్ధి కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు పశ్చిమ నియోజకవర్గం వన్ టౌన్ లోని బ్రాహ్మణ వీధిలోని శ్రీ వసంత మల్లి ఖార్జున స్వామి వారి దేవస్థానం (బుద్ధువారిగుడి) చైర్మన్ పిళ్లా సుదర్శన్ ఆద్వర్యంలో తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వినియోగించి తిరుమలను అపవిత్రం చేసినందుకు, భక్తుల మనోభావాలు దెబ్బ తీసినందుకు నిరసన గా ఆలయ శుద్ది కార్యక్రమం గురువారం జరిగింది.
ఈకార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్యవైశ్య కార్పొరేషన్ డూండీ రాకేష్ మాట్లాడుతూ తిరుపతి మహాప్రసాదం లడ్డు తయారీలో రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలను వైసిపి ప్రభుత్వం కాలరాసిందని దుయ్యబట్టారు. తిరుపతి లడ్డు ప్రసాదం పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆవు, పంది కొవ్వులతో తయారు చేసిన కల్తీ నెయ్యిను వినియోగించిన వైసిపి నాయకులు నిజం నిర్ధారణ అయిన తర్వాత కూడా కలరింగ్ ఇవ్వటం వైసిపి నాయకులకే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసిపి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఈ ప్రాంతానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ దేవదాయ శాఖ మంత్రి గా వుండి ఒక దేవాలయానికి న్యాయం చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాల అభివృద్ది కోసం పనిచేయకుండా తన జేబులు నింపుకునేందుకు మాత్రమే పనిచేశాడని విమర్శించారు. వై.ఎస్.జగన్ పాలన లో జరిగిన ప్రతి అన్యాయంపై ఆనాడు ఎన్డీయే కూటమి నాయకులు పోరాటాలు చేయటంతోపాటు ప్రశ్నించటం జరిగిందని, ఇప్పుడు వైసిపి అవినీతి కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయన్నారు. అవినీతి జరిగిందని నిర్ధారణ జరిగిన తర్వాత కూడా నిజం ఒప్పుకోకుండా నీతిమాలిన రాజకీయాలు చేయటం వైసిపి నాయకులకు చెల్లిందన్నారు.
అనంతరం జిల్లా కార్యదర్శి పిళ్లా శ్రీనివాసరావు , జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షుడు సోలంకి రాజు మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన వైసిపి నాయకులకి కోర్టులు సరైన శిక్ష విధిస్తాయన్నారు.. వైసిపికి ప్రజలు ఇప్పటికే సరైన శిక్ష విధించటం జరిగిందని, అయినా బుద్ది రాలేదని, . వైసిపి కాలగర్బంలోకి కలిసిపోవటం తప్ప…ముందుకు వెళ్లే పరిస్థితి లేదన్నారు.
శన్చేశ్వర ఆలయ చైర్మన్ గణపా రాము, , జిల్లా కార్యదర్శి భవానీ, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ నసీమా, పితాని పద్మ, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాదవ, ఉపాధ్యక్షుడు భవానీ శంకర్, నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి చైతన్య, రమేష్, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎమ్.డి అన్సార్, వాణిజ్య విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు యువరాజు, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలు పైడిమాల సుభాషిణి, క్లస్టర్ ఇన్చార్జులు ధనేకుల సుబ్బారావు, కరీముల్లా, నందం భవానీ ప్రసాద్, గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాల మాధవ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సి.హెచ్. అరుణ్, డివిజన్ అధ్యక్షులు కుంచం దుర్గారావు, ఈగల సాంబ, అమరా మురళీ కృష్ణ, నందే విజయలక్ష్మీ, నాయకులు గోలి శ్రీనివాసరావు,రమేష్,నమ్మి భాను, దుర్గా, మల్లేశ్వరి, టి.ఎన్.టి.యు.సి నాయకురాలు పద్మ, సుభానీ, ఎమ్.మోహనరావు, యు.రాము, సంధక వెంకట్రావు, ఐ టి డి పి నాయకులు శ్రీనివాస్, శనీశ్వరాలయం ధర్మకర్తలు నవీర మహేష్, గుండు బాలాజీ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News