అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జనాభా లెక్కల సేకరణ 2027పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలక్టర్లకు స్పష్టం చేశారు.రానున్న 2027 జనాభా లెక్కల సేకరణ,175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు,డిస్పెన్సరీలు,ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు, పాజిటివ్ పబ్లిక్ పెరసెప్సన్ అంశాలపై జిల్లా గురువారం ఎపి సచివాలయం నుండి ఆయన జిల్లా కలక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ముందుగా 2027 జనాభా లెక్కల సేకరణ సన్నాహక ఏర్పాట్లపై మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ సక్రమంగా సజావుగా నిర్వహించేందుకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆదిశగా కలక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ తగిన మార్గదర్శకాలను జారీ చేయడం జరిగిందని వాటిని తుఛ తప్పక పాటించి రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కలక్టర్లకు స్పష్టం చేశారు.జనాభా లెక్కల సేకరణ-2027పై ప్రజల్లో అవగాహనకు ప్రత్యేక ఐఇసి మెటీరియల్ ను ప్రచురించి అన్ని జిల్లాలకు పంపాలని రాష్ట్ర సెన్సస్ డెరెక్టర్ జె.నివాస్ ను సిఎసి విజయానంద్ ఆదేశించారు.
అంతకు ముందు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఇ పార్కులు ఏర్పాటు ప్రక్రియ ప్రగతిని సిఎస్ విజయానంద్ కలక్టర్లతో సమీక్షించారు.తదుపరి డిస్పెన్సరీలు,ఐఎంఎస్ ఆసుపత్రుల నిర్మాణానికి భూమి కేటాయింపు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈసమావేశంలో రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ గత జనాభా లెక్కల సేకరణ 2011లో జరిగిందని తదుపరి జనాభా లెక్కల సేకరణ వచ్చే ఏడాది జరగనుందని తెలిపారు.రానున్న జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని మొదటి దశ హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్(హెచ్ఎల్ఓ),రెండవ దశ పాపులేషన్ ఎన్యుమరేషన్ (పిఇ)జరుగుతుందని వివరించారు.ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత జూన్ 16 గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా మొదటి దశ జనాభా లెక్కల సేకరణకు ఈనెల 7వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని వివరించారు.2027 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే జిల్లా కలక్టర్లతో సమావేశం నిర్వహించినట్టు వివరించారు.ఇందుకు సంబంధించి మార్గదర్శకాలన్నీ జిల్లా కలక్టర్లకు పంపడం జరిగిందని తెలిపారు.జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్,మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగాను,మండల స్థాయిలో ఆర్డీఓ,తహసిల్దార్,బిడిఓలు చార్జి అధికారులుగా ఉంటారని చెప్పారు.జనాభా లెక్కల సేకరణకు ఎన్యుమరేటర్లు,సూపర్ వైజర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,స్వర్ణ గ్రామం,వార్డుల ఉద్యోగులు,స్థానిక సంస్థల ఉద్యోగులను వినియోగించు కుని వారికి తగిన పారితోషికం అందించడం జరుగుతుందని డైరెక్టర్ నివాస్ పేర్కొన్నారు.ఈ ఏడాది ఏప్రిల్ 1నుండి సెప్టెంబరు 30 వరకూ హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు.ఫిబ్రవరి 3వ వారంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధిరారులు,మున్సిపల్ కమీషనర్లకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ నివాస్ అన్నారు.
ఈసమావేశంలో రాష్ట్ర సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఆర్టీజిఎస్ సిఇఓ ప్రఖర్ జైన్ పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యశాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్,ఐఅండ్పిఆర్ డైరెక్టర్ కెఎస్,విశ్వనాధన్,జిల్లా కలక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News