Breaking News

ఆకాంక్షిత బ్లాక్ సూచికలలో నూరు శాతం ఫలితాలను సాధించాలి…

-పెనుగంచిప్రోలును ఆదర్శ మండలంగా నిలుపుద్దాం…
-జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పెనుగంచిప్రోలు ఆకాంక్షిత మండలం ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడంలో అధికారుల సమిష్టి కృషి అవసరమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. పెనుగంచిప్రోలు మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ముఖ్య అతిధిగా హాజరై ఆకాంక్షిత బ్లాక్ ల సూచికల అభివృద్ధిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్ప్రెన్ బ్లాక్లుగా ఉన్న ఇబ్రహీంపట్నం పెనుగంచిప్రోలు పనితీరు గతం కంటే ఎంతో మెరుగుపడిందన్నారు. రెండు మండలాలలో గర్భిణీల రిజిస్ట్రేషన్- వైద్య సేవలు, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్, గర్భిణీలకు పోషకాహారం, భూసార పరీక్ష కార్డుల జారీ, స్వయం సహాయక సంఘాల రివాల్వింగ్ ఫండ్ వంటి సూచకలల్లో 100 శాతం ఫలితాలు సాధించి నీతి ఆయోగ్ నుండి బంగారు పతకాలను సాధించడం అభినందనీయమన్నారు. సబ్కీ సాథ్, సబీకా వికాస్, సబీకా విశ్వాస్ సబీకా ప్రయాస్ మంత్రంతో గౌరవ ప్రధానమంత్రి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషిచేస్తున్నారన్నారు. గర్భిణీల రిజిస్ట్రేషన్- వైద్య సేవలు, హైపర్ టెన్షన్ స్క్రీనింగ్, డయాబెటిస్ స్క్రీనింగ్, గర్భిణీలకు పోషకాహారం, భూసార పరీక్ష కార్డుల జారీ, స్వయం సహాయక సంఘాల రివాల్వింగ్ ఫండ్ సూచికల్లో మండలాని ముందు ఉంచడంలో అధికారుల మధ్య సమన్వయం, నిబద్ధతకు కారణమన్నారు. వికసిత్ భారత్ ఏ 2047 దిశగా చేస్తున్న కృషిలో ప్రారంభించిన ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయన్నారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దామని మహిళలు తయారు చేస్తున్న ద్వాకా ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలంలోనూ కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ) ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఆరు సంవత్సరాల లోపు పిల్లలు తప్పనిసరిగా ఉండాలని అప్పుడే వారికి బలవర్ధకమైన పోషకాహారం అందుతుందని ఈ విషయంలో తల్లిదండ్రులు ముందుకు రావాలని సూచించారు. ఆరోగ్యం పోషణ, విద్య, వ్యవసాయం-అనుబంధ రంగాలు, ప్రాథమిక మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధికి సంబంధిత శాఖల సమష్టి కృషి ఎంతో అవసరమన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో పీఎం సూర్య ఘర్ సోలార్ ను ఏర్పాటు చేసి గ్రీన్ పంచాయతీలుగా చేయాలన్న లక్ష్యంతో తాను పనిచేస్తున్నానని ఇందుకు అందరూ సహకరించాలని కోరారు సోలార్ వలన పర్యావరణం పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చు చాలా తగ్గుతుందన్నారు. జిల్లా కలక్టర్ డా. జి. లక్ష్మీత అన్నారు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆకాంక్షిత జిల్లాలు, ఆకాంక్షిత బ్లాకుల కార్యక్రమం విజయవంతమైందనడానికి జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణకు నిదర్శనం అన్నారు. పెనుగంచి ప్రోలు మండలం ఆకాంక్షిస్తా బ్లాక్ గా పూర్తిస్థాయిలో రూపుదిదెందుకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం పోషకాహారం అందిస్తుందని వీటిని గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఆరు సంవత్సరాల వరకు చదివిన పిల్లలు శక్తివంతులుగా ఉంటారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమాత్రా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళుతున్నారని ముఖ్యమంత్రిని మనమంతా ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో నందిగామ ఆర్డివో కె. బాలకృష్ణ, తహాశీల్దార్ శాంతిలక్ష్మీ, ఎంపిడివో జి. శ్రీసు, ఐసీడీఎస్ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, జిల్లా పశుసంవతర్ధక శాఖ హనుమంతరావు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *