Breaking News

సమర్ధవంతమైన విపత్తు చర్యలు ప్రమాద తగ్గింపుకు దోహదం చేస్తాయి

-ప్రకృతి విపత్తుల్లో వ్యక్తులతోపాటు, కమ్యూనిటీలు ప్రధానపాత్ర పోషించాలి
-రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్

విజ‌యవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గింపే ధ్యేయంగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రధాన లక్ష్యంతో ఈ ఏడాది చివరికల్లా ఆ నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తామని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ అన్నారు.

స్థానిక బందరు రోడ్డులోని డీవీ మేనర్ హోటల్ లో రాష్ట్ర విపత్తు రిస్క్ తగ్గింపు కోసం రిస్క్ కమ్యూనికేషన్, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌పై రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్ షాపులో భాగంగా రెండో రోజు శుక్రవారం డిజాస్టర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తరచుగా సంభవించే తుఫానులు, వరదల సమయంలో సమాచారాన్ని త్వరితగతిన చేరవేసేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక కమ్యూనికేషన్ ఫ్రేమ్‌వర్క్ ను సిద్ధం చేసేలా పంచాయతీరాజ్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మహిళా శిశు సంక్షేమం, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సమాచార, పౌర సంబంధాల శాఖలకు చెందిన అధికారులు చర్చించడం శుభ పరిణామమన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తు నిర్వహణ) లైఫ్ సైకిల్‌లో ఉండే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వర్క్ షాప్ లో వివరణాత్మకమైన ప్రెజెంటేషన్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. వర్క్ షాప్ లో వివిధ శాఖల అధికారుల సూచనలన్నింటినీ క్రోడీకరించి ఒక ‘కోర్ గ్రూప్’ను ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రస్తుతం ఉన్న ప్రణాళికల్లో ఉన్న లోపాలను సవరించి వర్క్ షాపులో సూచనలను ఈ ఏడాది నుంచే పరిగణనలోకి తీసుకుని ‘ప్రీ-యాక్టివిటీ ప్లాన్’, ‘డిజాస్టర్ ప్లాన్’లో పొందుపరుస్తామన్నారు. వర్క్ షాప్‌లో ఉత్సాహంగా పాల్గొన్న వారందరూ ఎస్డీఎమ్ఏ, యూనిసెఫ్, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఆయా సంస్థలకు రాయబారులుగా (Ambassadors) వ్యవహరిస్తారని విశ్వసిస్తున్నానన్నారు. ఇది ముగింపు కాదు, కేవలం ఆరంభం మాత్రమేనని, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు జిల్లా స్థాయి, మండల స్థాయి, నుంచి స్వర్ణ గ్రామ/వార్డు సచివాలయ స్థాయి వరకు వెళ్లాలన్నారు. జిల్లా స్థాయిలో శిక్షణకు ఆయా జిల్లా కలెక్టర్లతో మాట్లాడి శిక్షణపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విపత్తుల సంభవించినప్పుడు ప్రజలకు సమాచారాన్ని అందించేటప్పుడు వారిని ఇబ్బంది పెట్టకుండా చాలా జాగ్రత్తగా, అర్థమయ్యేలా చేరవేయాలన్నారు..

కార్యక్రమంలో ఏపీఎస్డీఎమ్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్. వెంకట దీపక్, ఎన్ఐడీఎం జేడీ కల్నల్ పీఎస్ రెడ్డి, యూనిసెఫ్ స్పెషలిస్ట్ సీమా, బీవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్స్ ప్రతినిధులు, వివిధ జిల్లాల అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *