-బాల్య దశ నుండే మూగజీవాల సంరక్షణ పై అవగాహన అభినందనీయం…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జంతు సంరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని చిన్నతనం నుండే మూగజీవుల సంరక్షణపై అవగాహన కలిగి ఉండడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు.
జంతు సంరక్షణ పక్షోత్సవాలను పుస్కరించుకుని పశు సంవర్ధక శాఖ అధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జంతు సంరక్షణ అంశంపై నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జంతువులపై జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం పటిష్ట అమలు వీధులల వెంట తిరిగే పశువులను గురించి వాటిని పశువుల షెడ్లు ఏర్పాటు చేసి వాటిని సంరక్షించడం వేసవి కాలంలో ఆవాసా ప్రాంతాలలో నీటి తొట్టెల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం వంటి జంతు సంక్షేమ చర్యల పట్ల విద్యార్థులలో పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా బాబితారలకు జంతువుల సంరక్షణకు పూర్తి చర్యలు తీసుకున్న వారమవుతామన్నారు. జంతు సంరక్షణపై పాఠశాల మండల జిల్లా స్థాయిలో విద్యార్థులకు వ్యాస రచన క్విజ్ వతృత్వం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీలలో విజేతలకు అభినందిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
పోటీలలో జిల్లా స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన విజేతలైన నందిగామ పాఠశాల విద్యార్థి ఎస్ కె సాహెబ్, చందర్లపాడు పాఠశాలకు విద్యార్థిని ఎం శ్రీలేఖ, విజయవాడ సివిఆర్ హైస్కూల్ విద్యార్థులు బి. షర్మిల, ఎస్ శ్రీవల్లి, ఎం రాజవెంకట్, వీర్లపాడు మండలం దొడ్డదేవరపాడు పాఠశాల విద్యార్థులు ఎస్ సాయి ఉత్తజ్, పి. రోహిత్ కుమార్, పి. సాయి జస్పత్లకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు జ్ఞాపికలను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఉప సంచాలకులు డా. చంద్రశేఖర్రావు,డా, మోజస్ వెస్లీ, డా. ఎం వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు డా. సునంద తదితరులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News