గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్నవరం గాంధీ సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మ గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. గత కొంతకాలంగా సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో ఉన్న పాత విగ్రహం స్థానంలో, గన్నవరం గౌరవాన్ని చాటిచెప్పేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కాంస్య విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన్నట్లు చెప్పారు. ఈ కాంస్య విగ్రహానికి విరాళాలు అందజేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో కూడా ఆయన ఫోటో ఉంటుందంటే బాపూజీ గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. అయితే, దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీజీ వంటి మహనీయులకు, స్వాతంత్ర సమరయోధులకు ఇప్పటికీ ‘భారత రత్న’ దక్కకపోవడం బాధాకరమన్నారు. అదేవిధంగా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానుభావుడు ఎన్టీఆర్ కు కూడా భారత రత్న ఇవ్వకపోవడంపై ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విగ్రహాల ఏర్పాటు కేవలం గౌరవ సూచికమే కాదని, వారి ఆశయాలను భావితరాలకు అందించడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. రాజకీయాల్లో తాను ఎప్పుడూ విలువలకే ప్రాధాన్యత ఇస్తానని, రాజీ లేని రాజకీయాలు చేస్తూ గన్నవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రథమ లక్ష్యమని యార్లగడ్డ స్పష్టం చేశారు. గన్నవరం సెంటర్‌లో ఈ కాంస్య విగ్రహ ఏర్పాటుతో పట్టణానికి కొత్త శోభ వచ్చిందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం కు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు కీలక పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 1.74 కోట్ల వ్యయంతో దావోజీగూడెం నుంచి పామర్తి నగర్ వరకు నిర్మించనున్న రోడ్డు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 7 కోట్ల వ్యయంతో గన్నవరం నుంచి పుట్టగుంట వరకు రోడ్డు మరమ్మత్తు పనులకు కూడా శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత గన్నవరం పట్టణంలో రూ. 1.03 కోట్ల వ్యయంతో నిర్మించిన నాలుగు సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ. 5 లక్షల వ్యయంతో గన్నవరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆధునికీకరించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, జనసేన పార్టీ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, గన్నవరం సర్పంచ్ పాలడుగు వెంకట వరప్రసాద్, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, ఎంపీటీసీ లు పడమట రంగారావు, మద్దినేని వెంకటేశ్వరరావు, టిడిపి నాయకులు జాస్తి శ్రీధర్, చిరుమామిళ్ల సూర్యం, దొంతు చిన్న, దయాల రాజేశ్వరరావు, ఆళ్ల వెంకట గోపాలకృష్ణ, గొడ్డళ్ల రామారావు, కొలుసు రవీంద్ర, మూల్పూరి సాయి కళ్యాణి, మేడేపల్లి రమ, బోడపాటి రవి, పుట్టా సురేష్, మొవ్వ వెంకటేశ్వరరావు, కంభంపాటి వెంకట నరసమ్మ, పొదిలి లలిత, కొండేటి వెంకటేశ్వరరావు, బుస్సే నాగప్రసాద్, జొన్నలగడ్డ సుధాకర్, బుస్సే సరిత, ఆళ్ల దమయంతి, దేవినేని సులోచన, బేతాళ ప్రమీల జనసేన పార్టీ నాయకులు చిమట రవివర్మ, బీజేపీ నాయకులు కురుమద్ధాలి ఫణికుమార్, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు సాయి, జాస్తి ఫణి మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News