Breaking News

సురక్షిత ప్రయాణమే శ్రీరామ రక్ష

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
-అతివేగం ప్రాణాంతకం
-హెల్మెట్ ధారణ కుటుంబానికి, ప్రాణానికి రక్షణ
-రోడ్డు ప్రమాదాల నివారణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం : మంత్రి సవిత
-పెనుకొండలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు
-ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ల పంపిణీ
-బుల్లెట్ నడిపిన మంత్రి సవిత

పెనుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
సురక్షిత ప్రయాణమే కుటుంబానికి శ్రీరామ రక్ష అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. నిర్లక్ష్యం కుటుంబాలకు శాపం కాకుడదని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు. పెనుకొండలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా వివిధ సంఘాల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్ణణంలో వై జంక్షన్ నుంచి ఆర్డీవో కార్యాలయం ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా విద్యార్థులు, పట్టణ ప్రజలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి సవిత ప్రసంగించారు. మనిషి జీవితం ఆయా కుటుంబాలకు ఎంతో ముఖ్యమన్నారు. ప్రయాణ సమయాల్లో భద్రత చర్యలు తీసుకోవడం ద్వారా ప్రాణానికి రక్షణ లభించడమే వాహనదారుల కుటుంబాలకు ఎంతో మేలు కలుగజేస్తాయన్నారు. మద్యం సేవించి డ్రైవ్ చేయడం, హెల్మెట్ లేకుండా ద్వి చక్రవాహనం నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు. ప్రాణం పోయినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబాలకు తీరని నష్టం మిగిల్చుతాయన్నారు. అతివేగం ప్రాణాంతకమన్నారు. వాహనాలు నడిపే సమయంలో చిన్నపాటి నిరక్ష్యంతో నిండు జీవితాన్ని బలి తీసుకోవడమే కాకుండా బాధిత కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందన్నారు. సురక్షిత ప్రయాణమే కుటుంబానికి శ్రీరామ రక్ష అని స్పష్టం చేశారు. ప్రయాణ సమయాల్లో ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాని సూచించారు. కూటమి ప్రభుత్వం రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని అమలుచేస్తూనే, ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కలిగి స్తోందని మంత్రి సవిత స్పష్టంచేశారు. జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, వేగవంతమైన ప్రయాణాలతో జరగరాని సంఘటనలు చోటుచేసుకుంటే బాధిత కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. మనిషి ప్రాణం ఎంతో విలువైనదని, తిరిగి రానిదని అన్నారు.

హెల్మెట్ ప్రాణానికి, కుటుంబానికి రక్షణ

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, ఆర్డీవో ఆనందరావుతో కలిసి మంత్రి సవితి వాహనదారులకు ప్రమాదాలు, రోడ్డు భద్రతపై అవగాహన కలిగించారు. వై జంక్షన్ లో హెల్మెట్లు లేకుండా ద్విచక్ర వాహనం నడిపే వారిని గుర్తించి, హెల్మెట్లు అందజేస్తూ వారిని దుశ్శాలువతో సత్కరించారు. హెల్మెట్ ధారణ ప్రాణ రక్షణకు, కుటుంబానికి ఎంతో అవసరమో వివరించారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనంపై వస్తున్న ముస్లిం దంపతులను ఆపి, కుటుంబ యజమాని ప్రాణం విలువ గురించి అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయటకు రాగానే హెల్మెట్ ధరించేలా భర్తను ఒప్పించాలని ముస్లిం మహిళకు సూచించారు. రూ.రెండు లక్ష్లల విలువైన ద్విచక్ర వాహనం వస్తున్న యువకుడిని ఆపి హెల్మెట్ అందజేశారు. యువకుడి కుటుంబ సభ్యులకు మంత్రి సవిత స్వయంగా ఫోన్ చేసి, హెల్మెట్ ధరించేలా చూడాలని సూచించారు.

బుల్లెట్ బండి మీద డుగ్గు… డుగ్గుమని…

అంతకుముందు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల ఉద్దేశాన్ని వివరిస్తూ చేపట్టిన బైక్ ర్యాలీలో మంత్రి సవిత పాల్గొన్నారు. వై జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించి, ముందు వరుసలో బుల్లెట్ వాహనాన్ని నడుపుతూ పట్టణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో పట్ణణంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, పట్ణణ ప్రజలు, అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *