Breaking News

సమర్ధులకు సమన్నత గౌరవం: మంత్రి నిమ్మల రామానాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమర్థులైన ఉద్యోగులకు ఎప్పుడూ సమాజంలో సముచిత స్థానం, గౌరవం ఉంటాయని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ జలసౌద లో ఈఎన్ సి అడ్మిన్ శ్యాం ప్రసాద్, డిప్యూటీ ఈఎన్సి వీర ప్రతాప్ ల రిటైర్మెంట్ కార్యక్రమానికి హాజరైన మంత్రి నిమ్మల వారి ఉభయులకు అభినందనలు తెలియజేశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాగార్జున సాగర్ కుడి కాలువ వాటర్ మేనేజ్మెంట్, వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతి లో చీఫ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ సేవలు మరువలేనివన్నారు. సిఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెల్స్ బెంచింగ్, లైనింగ్, ఫీడర్ కెనాల్ జూన్ నాటికి పూర్తి చేసేలా శ్యాం ప్రసాద్ ప్రణాళికలు రూపొందించారని కొనియాడారు. నాగార్జునసాగర్ కుడి కాలువ, ప్రకాశం జిల్లా రైతులకు చీఫ్ ఇంజనీర్ శ్యాం ప్రసాద్ సేవలు గుర్తుండిపోతాయని కితాబిచ్చారు. అలాగే డిప్యూటీ ఈఎన్ సి వీర ప్రతాప్ గురించి కూడా ఆయన సేవలను కొనియాడారు. ఆయన అందించిన సేవలను గుర్తు చేశారు. ఒకే రోజు ఇద్దరు ఇంజనీర్లు రిటైర్ అవ్వడం ఇరిగేషన్ శాఖకు లోటే అయినా.. వారి విశ్రాంత జీవనం హాయిగా ఆనందంగా గడవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *