విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు పోటోలను ఎంపీ కేశినేని శివనాథ్ ఆదేశాల మేరకు భవానిపురం శివాలయం సెంటర్లో టిడిపి నాయకులు దగ్ధం చేశారు భవానీ పురం పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పై స్థానిక మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, కొట్టేటి హనుమంతరావు కేసుపెట్టారు. రాష్ట్ర టీడీపీ మహిళా నేత షేక్ ఆశ టిడిపి డివిజన్ అధ్యక్షులు సంతోష్, శివ శర్మ, రాంబాబు, పచ్చవ మల్లికార్జున, పశ్చిమ బీసీ సెల్ ప్రెసిడెంట్ శివాజీ వైసిపి నాయకుడు అంబటి రాంబాబును తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీ తల్లిని దూషించడం తగదని కులాలు, వర్గాలు ద్వేషించే పదాలు వాడే ఇలాంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి పోస్తాయిస్తున్నాడని మాజీ కార్పొరేటర్ రామయ్య ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు శివశర్మ బబ్బురి శ్రీనివాస్ వెంకటరావు, నందం భవాని, మక్కెనతెలుగు మహిళ అధ్యక్షురాలు షేక్ నసీం, పితాని పద్మ, అలీ, నజీబ్, అందే మేరీ, మాధవ్, మైలపల్లి రాజు, రెంటపల్లి రవి, రేగలర్ లక్ష్మణరావు, పేరం సత్యనారాయణ, షేక్ సుభానీ, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News