Breaking News

అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను మేయర్ ఖండన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
వై.యస్.ఆర్.సి.పి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై చేసిన వ్యాఖలను ఖండిస్తున్నామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శనివారం నగరంలోని చిల్లీ దాబా సెంటర్ వద్ద అంబటి రాంబాబు ముఖ్యమంత్రి పై చేసిన వ్యాఖ్యలను మేయర్ ఖండించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, వై.సి.పి నాయకులు అంబటి రాంబాబు సభ్య సమాజం తలదించుకొనేలా అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రిని దూషించడం పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజల శాంతియుత జీవనానికి కృషి చేస్తుంటే, వాటిని విఘాతం కలిగించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాజకీయ విమర్శలు చేయదలచుకుంటే పదునైన మాటలతో రాజకీయం చేయవచ్చు కాని, ఇటువంటి అప్రజాస్వామికమైన, అసభ్య పదజాలం వాడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం తప్పన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, ఇటువంటి తరుణంలో వై.సి.పి నాయకులు అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని దూషించడం రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *