Breaking News

రహదారి ప్రమాదాలు తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో రహదారి ప్రమాదాలు వలన తీవ్రమైన పబ్లిక్ హెల్త్ ఇష్యూ, పేదరికం , ప్రోడక్టవిటీ సమస్యలకు దారి తీస్తుందని, సురక్షితమైన ప్రయాణానికి రహదారి భద్రత నిబంధనలు వాహనదారులు పాటించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
శనివారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన “శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన” కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, గళ్లా మాధవి, రాష్ట్ర లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు పాల్గొన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం 1.60 లక్షల మంది రహదారి ప్రమాదాల్లో చనిపోతున్నారని చెప్పారు. ఇది విమాన ప్రమాదాలు, భూకంపాలు , యుద్దాలు జరిగినప్పుడు మరణించే వారి సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుందన్నారు.‌ ఇలా చనిపోయేవారిలో సగం మంది పైగా యువతే ఉంటున్నారని చెప్పారు. పరిపక్వత లేని మెదడు వలన వాహన ప్రమాదాలు వలన జరిగే తీవ్ర నష్టాలపై అవగాహన లేక రహదారి భద్రత నిబంధనలపై యువత నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.యాక్సిడెంట్లలో వెన్నుపూసలు, కాలి, చేతి ఎముకలు తదితర ప్రమాదాలు జరిగి జీవితాంతం మంచం పాలు అయితే, ఆ ప్రభావం మీ పైనే మాత్రమే కాదు యావత్ కుటుంబ భవిష్యత్తుపైనే ప్రభావం చూపుతోందని మర్చిపోవద్దని హితవు పలికారు. హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోతుంది అనేది కేవలం అపోహ మాత్రమే అని, ఎంతోమంది రేసర్లు నిత్యం హెల్మెట్ పెట్టుకుంటున్నా ఎ ఒక్కరికీ జుట్టు రాలడంలేదని అందరూ గుర్తించాలన్నారు. కొద్ది మోతాదులో మద్యం సేవించిన అది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపి వాహనం నడిపేటప్పుడు ప్రమాదానికి దారితీస్తుందన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్టు ధరించాలని, మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదన్నారు. రహదారి భద్రత నిబంధనలు పాటించడం ద్వారానే మన ప్రమేయం లేకుండా జరిగే వాహన ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చు అన్నారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రహదారి భద్రత నిబంధనలపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడంతోపాటు, నిబంధన ఉల్లంగించే వారిపై నిరంతరం తనిఖీ నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. వాహనదారులకు ఇబ్బందు లేకుండా గుంతల రహితంగా రహదారులను తీర్చిదిద్దడంతోపాటు, ప్రమాదాలకు అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్ వద్ద ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే వైద్య సహాయం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ముఖ్యంగా యువత రహదారి భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు.

జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రహదారి భద్రతా నిబంధనలు బాధ్యతగా పాటించటం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చు అన్నారు. దేశంలో జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో జాతీయ సంపద అయిన యువత ఎక్కువగా మరణించటం ఆందోళన కలిగిస్తుందన్నారు. హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఎక్కువగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం వాహనాలతో స్టెంట్ లు చేయడం ప్రమాదాలకు దారి తీస్తుందన్నారు. ప్రమాదాలకుగురైతే భవిష్యత్తు నాశనమవడంతో పాటు, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పారు.‌ జిల్లాలో రగదారి ప్రమాదాలు నివారణకు ప్రతినెల రవాణా, పోలీస్, రహదారులు, స్థానిక సంస్థల శాఖలతో రహదారి భద్రతా కమిటీ సమావేశ నిర్వహించి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రహదారి భద్రతా నిబంధనలపై, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

శాసనసభ్యులు గళ్లా మాధవి మాట్లాడుతూ పాఠశాల, కళాశాల స్థాయి నుంచే విద్యార్థులు, యువతకు రహదారి భద్రత నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. రహదారి ప్రమాదాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉండటం. ప్రమాదంలో చనిపోతున్నవారిలో 50% మంది యువత ఉండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో రహదారి భద్రత నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నారన్నారు. జిల్లాలో రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించే వారిపై సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఆటోలు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు.

బూర్గ రామాంజనేయులు మాట్లాడుతూ కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య, పిల్లలపై ప్రేమ ఉన్నవారు ఖచ్చితంగా రహదారి భద్రత నిబంధనలు పాటిస్తారన్నారు. . రహదారి ప్రమాదాల వలన మరణాల సంబంవించిన, క్షతగాత్రులైన కుటుంబసభ్యుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. రహదారి భద్రత నిబంధనలు పాటించాలని విద్యార్థులు కుటుంబ సభ్యులకు తెలియచేయాలన్నారు.

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, ఇతర పోటీలలో జిల్లాస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిలో విజేతలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బి. రామాంజనేయులు, బహుమతులను అందజేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి,  జిల్లా ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, జాతీయరహదారుల పీడీ పార్వతీశం, ఆర్డీవో శ్రీనివాసులు, ఆర్టీవో శ్రీహరి, ఎంవీఐలు, ఏఎంవీఐలు, డ్రైవర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *