Breaking News

పింఛన్ల పంపిణీకి ఏటా రూ. 33 వేల కోట్లు ఖర్చు

-63 లక్షల మందికి ప్రతీ నెల పింఛన్ల పంపిణీ
-సోలార్ తో విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ
-భీమవరం పర్యటనలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్

భీమవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భీమవరం పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ, ప.గో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. తొలుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్క రోజు ముందే ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. భీమవరం పర్యటనలో భాగంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ భీమవరం పట్టణం 6వ వార్డులో లబ్ధిదారులకు మంత్రి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి గొట్టిపాటి… దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 65 లక్షల మందికి పింఛన్లు అందజేస్తోందని మంత్రి తెలిపారు. పింఛన్ల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.33 వేల కోట్లను ఖర్చు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఎంతటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, పేదల పింఛన్ల పంపిణీని నిర్విరామంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.

అనంతరం భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలో అభివృద్ధి చేసిన పార్కును, పార్కులో ఏర్పాటు చేసిన సోలార్ లైటింగ్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. అలాగే పార్కులో ఏర్పాటు చేసిన గౌతమ బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పార్కును సుందరంగా అభివృద్ధి చేయడంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి.. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ను, హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ పార్కు భీమవరం ప్రజలకు, ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ కాలనీవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ సభ్యులు మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రామకృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి లను దుస్సాలువలతో ఘనంగా సత్కరించారు.

అనంతరం భీమవరం పురపాలక సంఘం, సోలార్ వెండర్ల సౌజన్యంతో రూ.14.80 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 30 వాట్ల సామర్థ్యం కలిగిన 63 సౌర వీధి దీపాలను కముజువారిపాలెం వద్ద మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. విస్సాకోడేరు వంతెన నుంచి కాలువ గట్టు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణం వరకు, తిరుమల కళాశాల నుంచి భారతీయ విద్యా భవన్ వరకు వీధి దీపాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సాంప్రదాయ విద్యుత్ లైట్లకు బదులుగా సోలార్ ఆధారిత లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్ వినియోగం తగ్గడంతో పాటు ప్రభుత్వ ఖర్చులు ఆదా అవుతాయని, పర్యావరణానికి మేలు జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, ఉండి శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణం రాజు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *