Breaking News

ఆర్థిక అసమానతలు తగ్గేలా కూటమి ప్రభుత్వ విధానాలు

-పేదలు ఎదగాలి… పారిశ్రామికవేత్తలు కావాలి
-ఎంఎస్ఎంఈలు స్థాపించే డ్వాక్రా మహిళలకు బ్యాంకర్ల సహకారం అవసరం
-వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు.. వారిని అన్ని విధాలా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వ విధానాలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పథకాల లబ్దిదారులతో సీఎం చంద్రబాబు ముఖాముఖీ అయ్యారు. పీ4 పథకంలోని బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ప్రతినిధులతో సీఎం సమావేశం నిర్వహించారు. అలాగే వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలోని లబ్దిదారులతో సంభాషించారు. అలాగే ప్రజా వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. టెక్నాలజీ వినియోగంతో వాతావరణం అంచనాలు, రియల్ టైమ్ డేటా ఎనలిటిక్స్ వంటి అంశాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. వైద్య సేవలను ప్రజల్లోకి మరింత అందించడం.. స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించిన స్టాల్స్ సందర్శించారు. ఈ ఏడాదిలో సంజీవని ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. డ్వాక్రా మహిళల ద్వారా పశుపోషణ చేపట్టి సాధికారత సాధించేలా కార్యక్రమం చేపడుతున్న స్టాల్ సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ పలువురు పాడి రైతులతో సంభాషించారు. ఆధార్ మాదిరిగా పశువుల కోసం రూపొందించిన గోధార్ ప్రాజెక్టు ప్రగతి ఎంత వరకు వచ్చిందని సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. పాడి రైతులకు తక్కువ ధరలో దాణా లభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పుట్టిన దూడలను తాము వెంటనే అమ్మేస్తామని సీఎంకు పాడి రైతులు చెప్పారు. పుట్టిన దూడలను వెంటనే అమ్మేసుకోకుండా ప్రత్యామ్నాయ విధానాలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. దాణాకు ఇబ్బంది లేకుండా గడ్డి పండించాలని సీఎం పాడి రైతులకు సూచించారు. ఇప్పుడు కుప్పంలో నీటికి ఇబ్బంది లేదు కాబట్టి… గడ్డి పెంపకం మీద దృష్టి పెడతామని పాడి రైతులు చెప్పారు.

బంగారు మిత్రలతో బంగారు కుటుంబాలకు అవగాహన

కుప్పం నియోజకవర్గంలోని పీ4 పథకంలో భాగంగా ఎంపికైన బంగారు కుటుంబాలు-మార్గదర్శులతో సీఎం సమావేశమయ్యారు. కుప్పంలోని మూడు మండలాలను దత్తత తీసుకున్న మెఘా ఇంజనీరింగ్, అదానీ ఫౌండేషన్, టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. రామకుప్పం మండలంలో ప్రస్తుతానికి 100 కుటుంబాలకు జీవనోపాధి చూపించామని మెఘా ఇంజనీరింగ్ ప్రతినిధి తెలిపారు. అర్హులైన లబ్దిదారులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి మెఘా ఇంజనీరింగ్ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. బంగారు కుటుంబాలకు ఆదాయం పెంచేలా చర్యలు చేపడుతున్నామని ఎంఈఐఎల్ ప్రతినిధి వెల్లడించారు. ప్రతి వంద కుటుంబాలకు ఓ బంగారు మిత్రను నియమించుకున్నామని… వారి ద్వారా బంగారు కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నామని మెఘా ఇంజనీరింగ్ ప్రతినిధి వివరించారు. ప్రస్తుతానికి 30 కుటుంబాలను గుర్తించి వారికి చేయూత ఇచ్చామని టీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. మరికొంత మంది బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకుంటామని టీవీఎస్ తెలిపారు. తమ ప్లాంట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పీ4 పథకం తెచ్చినందుకు సీఎం చంద్రబాబుకు బంగారు కుటుంబాల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. తల్లిని వదిలి ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లే అవసరం లేకుండా స్థానికంగా ఉపాధి పొందుతున్నామని లబ్దిదారులు సీఎంకు వివరించారు. పీ4 పథకంతో తమ జీవితాలు బాగుపడుతున్నాయని లబ్దిదారులు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”బంగారు కుటుంబాలకు అహగాహన కల్పించేలా బంగారు మిత్రలను నియమించుకోవడం మంచి పరిణామం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఏ మేరకు వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయొచ్చో చూడండి. దశలవారీగా పేద కుటుంబాలను వృద్ధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరగాలి. ఆర్దికంగా ఆదుకోవటంతో పాటు అక్షరాస్యత పెంచేలా చూడాలి, ఉపాధి కల్పించాలి. ఉద్యాన, డైరీ, సెరీ కల్చర్ లాంటి వివిధ రకాల ఉపాధి మార్గాలను ఎంచుకోవాలి. భూమిలేని వారికి పశువుల పెంపకం లాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపండి. 500-700 కుటుంబాలను క్లస్టర్ గా మార్చి పర్యవేక్షణ చేపడితే మార్పు కనిపిస్తుంది. సమాజంలో అసమానతలను తగ్గించే ఉద్దేశ్యంతో పీ4 అమలు చేస్తున్నాం. ఆదాయార్జనకు వివిధ రకాల మోడళ్లను అమలు చేయటం ద్వారా పేదల సంపద పెంచొచ్చు. మల్టిపుల్ అప్రోచ్ విధానంలో బంగారు కుటుంబాలకు చేయూత ఇవ్వాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను కూడా ఇంటిగ్రేట్ చేసుకోండి. త్వరలోనే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో పేద, ధనికా తేడా లేకుండా 2.50 లక్షల వరకూ ఉచితంగా వైద్య సేవలు అందేలా ప్రణాళిక చేశాం. కుప్పంలో ఏర్పాటు కాబోయే పరిశ్రమలతో 40 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.”అని ముఖ్యమంత్రి వివరించారు.

దళారుల ఇబ్బందులు తప్పాయి…

మరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూయర్ కార్యక్రమ లబ్దిదారులతో, వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఎంఎస్ఎంఈ సంస్థలు చేస్తున్న కార్యకలాపాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వం ప్రారంభించిన వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంతో తమకు లాభం చేకూరిందని పలువురు లబ్దిదారులు సీఎంకు వివరించారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న తాము చేస్తున్న వ్యాపారాలను ఈ పథకం ద్వారా విస్తరించుకుంటున్నామని లబ్దిదారులు ముఖ్యమంత్రికి వివరించారు. గతంలో తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు దళారులను ఆశ్రయించాల్సి వచ్చేదని… ఇప్పుడు వన్ ఫ్యామ్లీ వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం ద్వారా పారిశ్రామికవేత్తగా మారిన తర్వాత దళారుల బారిన పడకుండా తమ ఉత్పత్తులను తామే అమ్ముకోగలుగుతున్నామని పలువురు మహిళలు సీఎంకు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఎంఎస్ఎంఈలకు 95 శాతం మేర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుంచి గ్యారెంటీ ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాల్ని చెల్లించటంలో ముందున్నాయి. డ్వాక్రా రుణాల్లో కేవలం కేవలం 2 శాతమే నిరర్థక ఆస్తులుగా మారుతున్నాయి. ఎంఎంస్ఎంఈలు స్థాపిస్తున్న డ్వాక్రా మహిళలకు బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలి. అరకు కాఫీని కూడా ప్రమోట్ చేసేలా కార్యక్రమాలు చేపట్టాలి. టీ స్టాల్ చైన్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తాం. ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్, క్వాలిటీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పై లబ్దిదారులు దృష్టి పెట్టాలి. అందరి ఆదాయం పెరగాలి… సంపద అందరికీ దక్కాలి. ఆర్థిక అసమానతలను రూపుమాపేలా వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం ద్వారా కృషి చేస్తున్నాం.” అని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *