-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
క్లీన్ చిట్ అంటే ఏమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని చూసి వైసీపీ నేతలు నేర్చుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హితవు పలికారు. గతంలో తిరుమల లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంలో తమకు క్లీన్ చిట్ రాలేదని తెలిసినా వైసీపీ ఫేక్ బ్యాచ్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు పై బనాయించింది కేవలం ఫేక్ కేసు మాత్రమేనని అన్నారు. ఇప్పుడు ఈడీ ఇచ్చిన క్లీన్ చిట్‌తో ఆ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. వైసీపీ పన్నిన కుట్రలకు పాతరేస్తూ తమ నాయకుడికి ఈడీ క్లీన్ చిట్ ఇవ్వడం శుభపరిణామమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొనియాడారు. ఈడీ ఇప్పుడు తేల్చేసిన వాస్తవాలను ప్రజలు ఎప్పుడో గ్రహించారని, అందుకే గత ఎన్నికల్లో తమకు అఖండ విజయాన్ని అందించారని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి నిజంగా చేతనైతే, తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో విచారణకు హాజరై, ధైర్యంగా క్లీన్ చిట్ తెచ్చుకోవాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు.
Prajavartha Online Telugu News