Breaking News

కేంద్ర బ‌డ్జెట్ శ్లాఘ‌నీయం

-ఆలోచ‌న‌లో స్ప‌ష్ట‌త‌, చిత్త‌శుద్ధి, స‌రైన వ్యూహాల‌తో రూపొందిన బ‌డ్జెట్‌
-దేశం ఆత్మ నిర్భ‌ర‌త దిశ‌గా మ‌రో ముంద‌డుగు అన్న వైద్యారోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్‌
-దేశ ప్ర‌గ‌తికి దోహ‌దం చేసే విధాన ప‌త్రం
-క్యాన్స‌ర్ తో పాటు 17 ప్రాణాంత‌క ఔష‌ధాల‌పై దిగుమ‌తి సుంకాలు త‌గ్గించ‌డం స్వాగ‌తీయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆదివారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్ శ్లాఘ‌నీయ‌మ‌ని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మ‌రియు వైద్య విద్యా మంత్రి సత్య కుమార్ యాదవ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో స్వాగ‌తించారు. ఆలోచనలో స్పష్టత, చిత్త‌శుద్ధి, దృఢ సంక‌ల్పం, స‌వాళ్ల‌ను ఎదుర్కొనే ధైర్యంతో దేశాన్ని ఆత్మ నిర్భ‌ర‌త దిశ‌గా న‌డిపించేందుకు ఈ బ‌డ్జెట్ మ‌రో ముంద‌డుగ‌ని మంత్రి ప్ర‌శంసించారు. 2047 నాటికి నిర్దేశింసుకున్న ‘వికసిత భారత దేశ‌ ’ సాధనకు ఈ బ‌డ్జెట్ ఉప‌క‌రిస్తుంద‌ని మంత్రి అన్నారు. ప్ర‌స్తుత ప్ర‌పంచ రాజ‌కీయ, ఆర్థిక అస్థిర‌త మ‌రియు ఇత‌ర స‌వాళ్ల నేప‌థ్యంలో ఇదొక అత్యుత్త‌మ బడ్జెట్ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం మరియు ‘సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్’ అనే మూడు క‌ర్త‌వ్యాల‌ను నెర‌వేర్చే దిశ‌గా ఈ బ‌డ్జెట్ ను రూపొందించ‌డం జ‌రిగింద‌ని మంత్రి అన్నారు. ఎంఎస్ఎంఈలు, హ్యాండ్లూమ్స్ మ‌రియు టెక్ట్స్ టైల్స్‌ , బయో-ఫార్మా, అరుదైన ఖ‌నిజాలు, తయారీ రంగం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు( (SEZs) తదితర రంగాలకు ప్రోత్సాహ‌కాల ద్వారా ఉపాధి క‌ల్ప‌న‌కు ఈ బ‌డ్జెట్ తోడ్ప‌డుతుంద‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. ఆర్థిక స్థోమ‌త లేనివారికి మానసిక వైద్య సేవ‌లు మ‌రియు ట్రామా కేర్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం క్యాన్సర్ సహా 17 ప్రాణ ర‌క్ష‌ణ ఔషధాలపై దిగుమతి సుంకాల రాయితీ, అలాగే 7 అరుదైన వ్యాధులకు సంబంధించిన మందుల దిగుమ‌తిపై రాయితీలు క‌ల్పించ‌డాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ స్వాగ‌తించారు. రైతులు, మత్స్యకారులు, నేత కార్మికులు, దివ్యాంగులు, మహిళలు మరియు యువత సంక్షేమం కోసం ప్ర‌క‌టించిన ప‌లు చ‌ర్య‌లు ఈ బ‌డ్జెట్ యొక్క మాన‌వీయ కోణాన్ని ఆవిష్క‌రించాయ‌ని మంత్రి వివ‌రించారు. పన్ను సంస్కరణలు మరియు ఆర్థిక క్రమశిక్షణ దిశ‌గా … ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ‌తంలో ప్రారంభించిన సంస్కరణల ఎక్స్‌ప్రెస్ ప్ర‌యాణం ఈ బడ్జెట్‌ ద్వారా కొనసాగుతుంద‌ని, ఇది హ‌ర్ష‌నీయ‌మ‌ని మంత్రి అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *