Breaking News

7 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ

-రెండు ప్రధాన రహదారులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త
రూరల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రూ.7 కోట్ల నిధులతో విస్తృత పనులు చేపడుతున్నామని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. సోమవారం బాలాజీ పేట బొమ్మూరు నుంచి రాజవోలు శివారు వరకు రూ.3.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సిసి మరియు బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అలాగే ఎన్‌హెచ్–5 నుంచి పాత బొమ్మూరు వరకు (పోలీస్ క్వార్టర్స్, పిడింగొయ్యి, కవలగొయ్యి, బుచ్చయ్య నగర్, పిట్టలవాని చెరువు, శాటిలైట్ సిటీ ఏ.బి.సి బ్లాకులు, హుకుంపేట పంచాయతీ డి బ్లాక్, పాత బొమ్మూరు) ప్రాంతాల మీదుగా రూ.3.5 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సిసి–బీటీ రోడ్డుకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రహదారులు & భవనాలు శాఖ ద్వారా రెండు ప్రధాన రహదారులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల నాటికి తాడితోట జంక్షన్ నుంచి బొమ్మూరు జంక్షన్ వరకు ఈ రహదారి ప్రధాన మార్గంగా మారనుందని, సెంటర్ లైటింగ్‌తో నూతన రోడ్డును నిర్మిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు రామాలయం జంక్షన్‌ను విశాల రోడ్లతో అభివృద్ధి చేసిన విధంగానే, ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. బొమ్మూరు జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని, అక్కడ ఉన్న చెరువుపై ఆక్రమణలను తొలగించి కంబాల చెరువు తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అలాగే శాటిలైట్ సిటీ పరిధిలోని ఏ.బి.సి బ్లాకుల మీదుగా హుకుంపేట డి బ్లాక్ వరకు డబుల్ రోడ్డుతో, సెంటర్ లైటింగ్‌తో సిటీ స్వరూపం వచ్చేలా అభివృద్ధి చేయడం తన ధ్యేయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ తన అనుభవాన్ని వినియోగించి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ నాయకులు ప్రసాద్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, పిల్లా తనుజ, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్, కామిని ప్రసాద్, కోళ్ళ సత్తిబాబు, ఎమ్మెస్సార్ శ్రీను, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కుంచె హనుమంతరావు, వాసుపల్లి అనంతలక్ష్మి, మండ హిమబిందు, యలమాటి రామకృష్ణ, బైరుత్తి సరోజినీ దేవి, కోటిపల్లి అమ్ములు, వెంకటలక్ష్మి, జ్యోతి, పెంకే కోటేశ్వరరావు, దారా అన్నవరం, ఎర్ర రాంబాబు, గుడిసిపూడి నాగేంద్ర, చౌడాడ సునీల్, గెద్దాడ కృష్ణ, ఆర్&బి డీఈ ఎం. మను, జేఈ సిద్ధార్థ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *