గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వ్యాపార సంస్థ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, 2026-27 ట్రేడ్ ఫీజులు జనరేట్ అయినందున నెలాఖరులోపు చెల్లించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజారోగ్య చట్ట ప్రకారం నగర పరిధిలో వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరూ ట్రేడ్ లైసెన్స్ కల్గి ఉండాలని, లేని వారు తక్షణం అందుబాటులోని వార్డ్ సచివాలయంలోని శానిటేషన్ కార్యదర్శికి దరఖాస్తులు అందించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామని, తమ అవుట్ డోర్ ఇన్స్పెక్షన్లలో వాటిపై దృష్టి సారిస్తామని తెలిపారు. ఎక్కడైనా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన ట్రేడ్ లైసెన్స్ లేకుండా గుర్తిస్తే వారితో పాటు సంబందిత శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఈ నెలాఖరులోపు చెల్లించాలని, లేకుంటే మార్చి 1వ తేదీ నుండి బకాయిలపై 25 శాతం అపరాధ రుసుం విధించబడుతుందని తెలిపారు.
Prajavartha Online Telugu News