Breaking News

విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనుల్లో చిన్న కాంట్రాక్టరులు న‌ష్ట‌పోకుండా ఎంపీ కేశినేని శివ‌నాథ్ చ‌ర్య‌లు

-ఆగిపోయిన బిల్లుల‌కు నిధులు మంజూరు చేయాల‌ని కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకి విజ్ఞ‌ప్తి
-ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్వంలో కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడును క‌లిసిన గోల్డ్ మెడ‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ జైన్

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మిన‌ల్ నిర్మాణ పనులకి సంబంధించి కాంట్రాక్ట‌ర్ మార‌టంతో….చిన్న చిన్న కాంట్రాక్ట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా ఎంపీ కేశినేని శివ‌నాథ్ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ లో కేంద్ర పౌర విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడును ఆయ‌న కార్యాల‌యంలో క‌లిశారు. విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ అంతర్జాతీయ టెర్మిన‌ల్ నిర్మాణానికి సంబంధించి ప‌నుల జాప్యం కార‌ణంగా పాత కాంట్రాక్టర్ ను మార్చిన నేప‌ధ్యంలో చిన్న చిన్న కాంట్రాక్ట‌ర్లు ఇబ్బంది ప‌డ‌కుండా బిల్లులు మంజూరు చేయాల‌ని కోరారు..కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు త‌క్ష‌ణం స్పందించిన సంబంధిత అధికారుల‌కు పోన్ లో ఆదేశాలు జారీ చేశారు.

రాజ‌స్థాన్ లో స్కూల్ ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం
విజ‌య‌వాడకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గోల్డ్ మోడ‌ల్ ఎల‌క్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట‌ర్, పాబుదేవి ఓట్మల్ గోరాజీ చారిటబుల్ ట్రస్ట్ ట్ర‌స్టీ ప్ర‌వీణ్ కుమార్ జైన్ , ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆధ్వ‌ర్యంలో కేంద్ర‌ పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు క‌లిశారు. రాజస్థాన్ జాలోర్ జిల్లాల‌ని రేవ‌త్రా ప్రాంతంలో పాబుదేవి ఓట్మల్ గోరాజీ చారిటబుల్ ట్రస్ట్ నిర్మించిన పాబుదేవి ఓట్మల్ గోరాజీ, గ‌వ‌ర్న‌మెంట్ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ (గోల్డ్ మెడ‌ల్ ) ప్రారంభోత్స‌వ‌క కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా ఆహ్వ‌నించారు. త‌మ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో నిర్మించిన ఈ సీనియ‌ర్ సెకండ‌రీ స్కూల్ రాజ‌స్థాన్ ప్ర‌భుత్వానికి అప్ప‌గించిన‌ట్లు ప్ర‌వీణ్ కుమార్ జైన్ వారికి తెలిపారు. ఐదు ఎక‌రాల సువిశాల ప్రాంగ‌ణంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ స్కూల్ నిర్మించిన‌ట్లు వివ‌రించారు. ఎంపీ కేశినేని శివ‌నాథ్ విజ్ఞ‌ప్తి మేర‌కు కేంద్ర‌ పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు స్కూల్ ప్రారంబోత్స‌వానికి రావ‌టానిక అంగీక‌రించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు తెన్నేటి కృష్ణ ప్రసాద్, జి. ఎం. హరీష్ బాలయోగి లతో పాటు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *