Breaking News

సిఆర్డిఏ అధికారుల ఆధ్వర్యంలో అనధికార లే అవుట్ల ధ్వంసం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
ఏపీ సిఆర్డిఏ పరిధిలో మంగళవారం అక్రమ లే అవుట్లను అధికారులు ధ్వంసం చేయించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడిలోని సర్వే నెంబర్లు 292, 295, 297, 299, 325, 332 ఎండ్రాయిలోని సర్వే నెంబర్లు 89,198
నరుకుళ్లపాడులోని సర్వే నెం. 123 ధరణికోటలోని సర్వే నెంబర్లు 346, 99 అమరావతిలోని సర్వే నెంబర్లు .64, 65,151
పెదమద్దూరులోని సర్వే నెం. 77 వైకుంఠపురంలోని సర్వే నెం. 264 నెమలికల్లులోని సర్వే నెం. 122 భూమిలో ఏర్పాటవుతున్న అనధికార లే అవుట్‌లను సిఆర్డిఏ డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగం అధికారులు ధ్వంసం చేయించారు. మొత్తంగా 22 ఎకరాలలో ఏర్పాటైన 15 అనధికార లే అవుట్‌లను మంగళవారం ధ్వంసం చేయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో CRDA డెవలప్మెంట్ ప్రమోషన్ విభాగ గుంటూరు జోనల్ జాయింట్ డైరెక్టర్ మహాలక్ష్మి దొర, జోనల్ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పావని, వార్డ్ ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రటరీ రవీంద్ర పాల్గొన్నారు. సిఆర్డిఏ పరిధిలో అనధికార లే అవుట్లను ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *