Breaking News

కొనసాగుతున్న మీటర్ రీడర్స్ యూనియన్ “మహాధర్నా”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ సంస్థలలోని మూడు డిస్కంలలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ అందరికి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న “మహాధర్నా” కార్యక్రమం 3వ రోజుకు చేరింది. గతమూడు రోజులుగా రాత్రి, పగలు ధర్నా చౌక్‌లోనే నిద్రాహారాలు లేకుండా నిరసన తెలియజేస్తున్న మీటర్ రీడర్స్‌ను ప్రభుత్వం, యాజమాన్యము పట్టించుకోకపోవడం అన్యాయం. విపరీతమైన దోమలు, మంచు కురుస్తున్నా చలిలో నడిరోడ్డుపై మీటర్ రీడర్స్ తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వెంటనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర కమిటి డిమాండ్ చేస్తున్నది.
మన రాష్ట్రంలో 3 డిస్కంలలో 4000 మంది మీటర్ రీడర్స్ 10సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. అసలే అరకొర వేతనాలతో పనిచేస్తున్న రీడర్స్కు స్మార్ట్ మీటర్స్ రావటంతో ఉన్న ఉపాధి ఊడిపోయే పరిస్థితి వచ్చింది. స్మార్ట్ మీటర్స్ వలన సర్వీసులు తగ్గిపోయి వచ్చే వేతనం సగానికిపైగా కోత పడుచున్నది. రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్స్ బిగింపు పూర్తి అయితే మీటర్ రీడర్స్ అందరూ రోడ్డునపడే పరిస్థితి. మీటర్ రీడర్స్కి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని యాజమాన్యం, ఇంధనశాఖామంత్రి, లోకేష్ పలుమార్లు హామీయిచ్చారు. యాజమాన్యం గతంలో చర్చించి ఇచ్చిన హామీలు, మినిట్స్ కూడా నేటి అమలుకు నోచుకోలేదు. రీడింగ్ పని దినాలతోపాటు మిగిలిన రోజులకు పనికల్పించి నెలవారీ వేతనం ఇస్తామన్న హామీ ఆచరణకు నోచుకోలేదు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను, యాజమాన్యం కలిసినా న్యాయం చేస్తామని చెప్పటం తప్ప ఆచరణలో ముందడుగు పడటంలేదు.
మీటర్ రీడర్స్ అందరిని అర్హతల ఆధారంగా విద్యుత్ సంస్థలోనే బ్రేక్డౌన్ సిబ్బందిగా, ఫీల్డ్ అసిస్టెంట్ పోల్ టు పోల్ వర్కర్స్, అటెండర్స్, వాచ్మెన్, ఆఫీస్ సబార్డినేట్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, డ్రైవర్స్ వంటి సిబ్బందిగా ఔట్సోర్సింగ్ పద్ధతిలోకి మార్చాలని, రీడింగ్ పనిదినాలతో పాటు మిగిలిన రోజులకు పనికల్పించి నెలవారీ వేతనం ఇవ్వాలని ఎ.పి.వి.యం.ఆర్. రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఫిబ్రవరి 2వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో వేలాదిమంది హాజరు అయ్యారు. అప్పటి నుండి ధర్నాచౌక్లోనే పగలూ, రాత్రి నిద్రాహారాలు మాని రీడర్స్ అందరూ నడిరోడ్డుపైనే నిరసన కొనసాగిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా సమస్యను పరిష్కరించాలని ఎ.పి.వి.ఎం.ఆర్. డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారు సిపిఐ స్టేట్ సెక్రటరీ జి.ఈశ్వరయ్య, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, శ్రామిÅ£ హక్కుల పోరాట సంఘం నాయకులు రఘు, ఏఐటియుసి స్టేట్ జనరల్ సెక్రెటరీ రమేష్, మునిసిపల్ వర్కర్స్ యూనియన్ సుబ్బారాయుడు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి నాయకులు ఆర్.పిచ్చయ్య, మీటర్ రీడర్స్ గౌరవాధ్యక్షులు ఎం. బాలకాశి, సిపిఐ పార్టీ నాయకులు పి. ప్రసాద్, వి. బంగారురావు, కటం నాగభూషణం, శ్రీనివాస్‌రావు, జాప్తి కిషోర్‌బాబు, ఎం.రామకృష్ణ, అలాగే మీటర్ రీడర్స్ అధ్యక్షులు రామకృష్ణ, కోశాధికారి రమేష్‌బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ శివారెడ్డి, కిరణ్‌కుమార్, శివరామకృష్ణ తదితర జిల్లాల నుంచి మీటర్స్ రీడర్స్ అందరూ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *