Breaking News

నగరంలో ఉచిత సర్వకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా శిబిరం, అవగాహన కార్యక్రమం


విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ఫిబ్రవరి 4వ తేదీ ప్రపంచ కాన్సర్ దినోత్సవ సందర్భంగా రూట్స్ హెల్త్ ఫౌండేషన్ మరియు శ్రీ జైన్ శ్వేతంబార్ తెరా పంత్ మహిళా మండల్ ఆధ్వర్యంలో ఉచిత సర్వకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షా శిబిరం మరియు అవగాహన కార్యక్రమం గురునానక్ కాలనీనందు నిర్వహించారు. ఈ సందర్భంగా రూట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ మాట్లాడుతూ సర్వకల్ క్యాన్సర్ వలన ప్రతి సంవత్సరం 79,000 మంది మరణిస్తున్నారన్నారు. ఈ క్యాన్సర్‌ను పాప్స్మెయర్ ఈపరీక్ష ద్వారా సులభంగా గుర్తించవచ్చునని పేర్కొన్నారు. మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్. పి. అనిల మాట్లాడుతూ హెచ్.పి.వి. వాక్సిన్ వేయటం ద్వారా బాలికలకు, మహిళలకు సర్వకల్ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని, ఈ వాక్సిన్ నేషనల్ ఇమ్మ్యూనిజషన్ స్కీంలో ప్రభుత్వం చేర్చిందని పేర్కొన్నారు. అనంతరం 100 మంది మహిళలకు ఉచిత పాప్స్మెయర్ పరీక్షలు చేసారు.
అనంతరం శ్రీ జైన్ శ్వేతంబార్ తెరా పంత్ మహిళా మండల్ నిర్వాహకులు మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా ప్రజలకు వివిధ రంగాలలో సేవలను అందిస్తున్నందుకు మండల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మా సంస్థ ద్వారా వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలకు అవసరమైన వస్తువులను అందించడం, హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం, స్వర్గపురి నిర్మాణ కార్యక్రమాలు, రోగులకు పౌష్టికాహారం, దుస్తులు పంపిణీ చేయడం, యువతీ యువకులకు క్రికెట్ కిట్లు, ఆట వస్తువులు, పరీక్షల సమయంలో పెన్స్, ప్యాడ్స్ అవసరమైన వస్తువులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని తెలియజేశారు. ఈ ఉచిత శిబిరానికి రఘు జీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సంగీత, సెక్రటరీ మధు, కుసుమ్‌దోషి, సారిక, మంజు, అశోక్ శ్వేతా, అమెరికన్ ఆంకాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *