Breaking News

పీకలవాగుని సమగ్రంగా సర్వే చేసి, నివేదిక ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో మురుగుపారుదలకు కీలకమైన పీకలవాగుని సమగ్రంగా సర్వే చేసి, నివేదిక ఇవ్వాలని సిటి ప్లానర్ ని, పూడికతీతకు ప్రతిపాదనలు అందించాలని ఎస్ఈని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవితో కలిసి బ్రాడీపేట, కంకరగుంట ఆర్యూబీ, కోబాల్ట్ పేట, దేవాపురం ప్రాంతాల్లో పీకలవాగుని కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీకలవాగు అత్యంత ప్రధానమైన డ్రైన్ అని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆక్రమణల వలన వర్షాకాలం పొంగి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమ దృష్టికి తెచ్చారన్నారు. పీకలవాగుని సమగ్రంగా సర్వే చేసి, పూర్తీ స్తాయి వివరాలు అందించాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. పీకలవాగులో పూడిక తీయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఎస్ఈని ఆదేశించారు. పీకలవాగు చుట్టూ ప్రక్కల నివాసాల వారు వ్యర్ధాలను అందులో వేస్తున్నారని, అలా వేయకుండా ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు అవగాహన కల్గించాలని, అవసరమైతే అపరాధ రుసుం విధించాలన్నారు. కోబాల్ట్ పేటలో లో లెవల్ ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణాలకు అంచనాలు సిద్దం చేయలని ఈఈని ఆదేశించారు.
శాసన సభ్యులు మాధవి మాట్లాడుతూ పీకలవాగులో పూడిక తీయక పోవడం, ఆక్రమణల వలన వర్షాకాలం స్థానిక ప్రజలు మురుగులోనే నివాసం ఉండాల్సి వస్తుందన్నారు. నగరపాలక సంస్థ అధికారులు సమన్వయంతో సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్లను కూడా మాస్టర్ ప్లాన్ మేరకు విస్తరణ చేయాలని కోరారు. వాగుపై ఉన్న కల్వర్ట్ ల మరమత్తులను కూడా చేపట్టాలన్నారు.
పర్యటనలో సిపి రాంబాబు, ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఈఈ వేణు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *