Breaking News

నగరాన్ని గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ (జివిబి) ఫ్రీ నగరంగా తీర్చిదిద్దుకోవాలని, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల నూరు శాతం వసూళ్లు కావాలని, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పనితీరు మెరుగుపరుచుకోకుంటే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమవేశ మందిరంలో ప్రజారోగ్య విభాగ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత వార్డ్ ల వారీగా మైక్రో ప్యాకెట్స్, కార్మికుల హాజరు, రోజువారీ సేకరించాల్సిన చెత్త, ఏటుకూరు పాయింట్ కి డివిజన్ల వారీగా వచ్చిన చెత్త, జివిబిలు తదితర వివరాలు ఇన్స్పెక్టర్లను అడిగి మాట్లాడుతూ, రానున్న 2 వారాల్లో జివిబిలు లేని నగరంగా ఉండాలని, అందుకు ఎస్ఎస్ లు మరింతగా పర్యవేక్షణ చేయాలన్నారు. నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ చేయడం, కమర్షియల్ చెత్త సేకరణ ఏజన్సీలు సక్రమంగా ఉంటే జివిబిలు ఉండవన్నారు. అప్పటికీ చెత్త రోడ్ల మీద, డ్రైన్లలో వేసే వారిపై అపరాధ రుసుం విధించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గుంటూరు నగరంలో అవసరమైనదానికి మించి కార్మికులు విధుల్లో ఉంటున్నారని, అదనంగా కూడా కార్మికులను రోజువారీ వేతనంపై తీసుకుంటున్నా, ప్రణాళికాబద్దమైన కృషి లేకపోవడం వలనే పారిశుద్యంపై ప్రజల్లో అసంతృప్తి ఉంటుందన్నారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కార్మికులు హాజరు గూగుల్ స్ప్రెడ్ షీట్ లో అప్ లోడ్ చేయాలన్నారు. ఎన్జీటీ, ఎస్డబ్ల్యుఎం గైడ్ లెన్స్ మేరకు ప్రతి ఇంటి నుండి తడిపొడిగానే చెత్త సేకరణ జరగాలన్నారు. కార్మికులు ఎక్కడ ఎంత మంది క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉంటుంది, ఎవరు ఎక్కడ పని చేస్తుంది, వారి హాజరు తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన ఉందని, ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు నిర్దేశిత సమయం విధుల్లో ఉండాలన్నారు.మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ చేయకపోవడం వలన డ్రైన్లలో మురుగు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇక నుండి మధ్యాహ్నం సమయంలో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు.ట్రేడ్ లైసెన్స్ ల పై కూడా దృష్టి సారించాలన్నారు. ప్రతి ఒక్కరూ పని తీరు మార్చుకొని, స్వచ్చ లీగ్ సిటి స్థాయిలో ఉన్న గుంటూరు నగరాన్ని అదే స్థాయిలో ఉండేలా కృషి చేయాలన్నారు.
సమావేశంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, విఏఎస్ డాక్టర్ నాగేశ్వరరావు, డిఎస్ఓ ప్రసాద్, శానిటరీ సూపర్వైజర్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *