Breaking News

ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మార్చి 19న నిర్వహించనున్న శ్రీ “పరాభవ” నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులకు ‘ఉగాది’, ‘కళారత్న’ పురస్కారాలను ప్రధానం చేయడం జరుగుతుందని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జునరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

1. సాహిత్యం 2. సంగీతం 3. నృత్యం 4. చిత్రలేఖనం 5. శిల్పం 6. నాటకం 7. జానపదం 8. మిమిక్రీ 9. అవధానం 10. వైద్యం 11. ఇంద్రజాలం & మూకాభినయం 12. హరికథ & బుర్రకథ 13. జర్నలిజం 14. సామాజిక సేవ, 15. కమిటీ సిఫార్సు చేసిన ఇతర సేవారంగాలు వంటి 15 విభాగాల్లో నిష్ణాతులైన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.. గతంలో కేంద్ర ప్రభుత్వ అవార్డులు లేదా రాష్ట్ర స్థాయి ఉగాది/కళారత్న పురస్కారాలు పొందిన వారి ధరఖాస్తులు పరిశీలించరన్నారు. ఆసక్తి కల్గినవారు తమ బయోడేటాను ఫిబ్రవరి 20, 2026 లోపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, రెండవ అంతస్ధు ఘంటశాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల, దుర్గాపురం, విజయవాడ కార్యాలయానికి పంపించవచ్చునని లేదా apculture.ugadi2026@gmail.com ఈమెయిల్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో ఆర్. మల్లిఖార్జునరావు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *