Breaking News

జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వ్యవసాయం, ఆక్వా కల్చర్, పరిశ్రమలు, ఓడరేవు ప్రధానంగా జిల్లా అభివృద్ధికి గ్రోత్ ఇంజన్లుగా దోహదపడతాయని జిల్లా కలెక్టర్ డీ జే బాలాజీ సింగపూర్ బృందానికి వివరించారు. బుధవారం ఉదయం సింగపూర్ వ్యాపార, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చొంగ్ పూ షీన్ నేతృత్వంలో సింగపూర్ బృందం సభ్యులు డిప్యూటీ సీఈవో తే లియాన్ చెన్ , చువా టైక్ హిం, నిషా షర్డా జిల్లాను అమరావతి ఆర్థిక కారిడార్ లో చేర్చి ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్న అవకాశాలు, , వనరుల పరిశీలనకు బాపట్ల నుండి బయలుదేరి నగరంలోని ఆర్ అండ్ బి అతిధి గృహానికి చేరుకోగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మర్యాదపూర్వకంగా వారికి పూల మొక్కలు అందజేసి, శాలువలతో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు.

అనంతరం వారితో కలిసి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని మీకోసం సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో భౌగోళిక స్థితిగతులను, ఆర్థికంగా అభివృద్ధి పరిచేందుకు ఉన్నటువంటి వనరులను సింగపూర్ బృందానికి విపులంగా తెలియజేశారు

జిల్లా కలెక్టర్ బృందానికి వివరిస్తూ జిల్లా ప్రధానంగా వ్యవసాయ ఆధారిత సముద్రతీర ప్రాంతం అన్నారు. బ్రిటిష్ కాలం నుండి ఈ ప్రాంతంలో మంచి వనరులు ముఖ్యంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం ఉండటంతో
పన్నులు ఎక్కువగా వసూలు అయ్యేవన్నారు. ఇక్కడ ప్రధాన ఇంజిన్ గ్రోత్ వ్యవసాయమేనన్నారు. ఈ ప్రాంతంలో సంవత్సరానికి వరి, మినుము రెండు పంటలు సాగు చేస్తారన్నారు. అప్లాండ్ ప్రాంతాలైన మల్లవల్లి, వీరపునేనిగూడెంలలో పారిశ్రామిక వాడలు నెలకొల్పడం జరిగిందన్నారు. 377 పరిశ్రమలకు స్థలాలు కేటాయించామన్నారు. అలాగే మేధా ఐటి టవర్స్, టిసియల్ కంపెనీ వంటివి ఏర్పాటు చేయబడ్డాయన్నారు. జిల్లాలో వ్యవసాయం ద్వారా 50 శాతం ఆదాయం లభిస్తోందన్నారు. అందులో 80 నుంచి 90 శాతం ఆక్వాకల్చర్ మీదనే వస్తుందన్నారు

ఈ ప్రాంతంలో ప్రకృతి వ్యవసాయంలో భాగంగా రైతులు ఎల్ ఆకారంలో మట్టి కట్టలు (ఎల్ బండ్) ఏర్పాటు చేసి కూరగాయలు తోటలను పెంచుతూ ఆదాయం లోటు లేకుండా చూసుకుంటున్నారన్నారు. ఇటీవల కాలంలో చాలామంది రైతులు ఈ ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారన్నారు. తొలకరి వర్షాలు పడకమునుపే 32 రకాల విత్తనపు బంతులు (సీడ్ బాల్స్ )తో ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పేరుతో వివిధ రకాల మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచడం జరుగుతుందన్నారు తద్వారా భూమి పోషక విలువలతో సారవంతం అవుతుందన్నారు. ఇది భవిష్యత్తులో పెద్ద గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. తద్వారా ఆర్థిక అభివృద్ధి, నాణ్యత గల పంటలు ఉత్పత్తి, మంచి ధర లభిస్తుందన్నారు.
జిల్లాలోని ఆక్వా కల్చర్ లో ష్రిమ్ప్ రొయ్యల ఉత్పత్తి ప్రధానంగా జరుగుతోందని, దేశంలోనే జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. పలు విదేశాలకు ఎగుమతులు చేస్తున్న చేయడం జరుగుతుందన్నారు ప్రపంచ మార్కెటులో పెద్ద ఎత్తున పోటీ ఉందన్నారు. ఆక్వా కల్చర్ లో డేటా సేకరణ, ట్రెసబిలిటీ ఇదివరకు సమస్యగా ఉండేదని నేడు ఆక్వా ఎక్స్చేంజ్ అనే స్టార్ట్ అప్ కంపెనీతో అనుసంధానం చేసుకొని జిల్లాలో నందివాడ మండలంలోని 6 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టగా విజయవంతంగా నడుస్తోందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేయడం వలన విద్యుత్ బిల్లు ఆదా అవడంతో పాటు కూలి ఖర్చులు తగ్గాయన్నారు. చెరువులో రొయ్యలకు సమానంగా ఆహారం పంపిణీ అవుతుందన్నారు.ఆక్వా కల్చర్ సాగు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించే ఏర్పాటుతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. చెరువుకు జియో ట్యాగింగ్ చేసి విశిష్ట నంబరు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో మండలమంతా విస్తరిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి బందరు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు అతి సమీపంలో ఉందన్నారు. ఈ ఓడరేవు ఈ ఏడాది డిసెంబర్ నాటికి నాలుగు బెర్తులతో తొలి దశ పూర్తవుతుందన్నారు.
అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కూడా దగ్గర ఉన్న ఓడరేవు ఇదేనన్నారు. హైదరాబాదు నుండి 6 వరసల జాతీయ రహదారి నిర్మించడం జరుగుతుందన్నారు. గేట్ వే ఆఫ్ అమరావతిగా మచిలీపట్నం నిలుస్తుందన్నారు. త్వరలో షిప్ బిల్డింగ్ కూడా ఓడరేవులో చేపట్టడం జరుగుతుందన్నారు. పోర్టు ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రానున్నాయన్నారు. అలాగే జిల్లాలో పెడన కలంకారి వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని, ఘంటసాల లోని గౌతమ బుద్ధుని స్థూపాలు, చిహ్నాలు, మ్యూజియం ఉన్నాయని తద్వారా విస్తృతంగా పర్యాటకం అభివృద్ధి చ చెందుతుందన్నారు. మచిలీపట్నం ఒక గ్రాము బంగారం అనుకరణ ఆభరణాలకు ప్రసిద్ధి చెందిందని, సంవత్సరానికి 120 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందన్నారు.

కూచిపూడి శాస్త్రీయ నృత్యం దేశంలోనే పేరుగాంచిందన్నారు. కూచిపూడి నృత్యానికి సంబంధించి అవసరమైన దుస్తులను, వస్తువులను స్థానికంగానే తయారు చేయించడం జరుగుతుందన్నారు. తద్వారా సాంస్కృతిక వారసత్వ సంపదలను కాపాడుకుంటున్నామన్నారు. అలాగే మచిలీపట్నం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయము, ఆంధ్రమహావిష్ణువు నడయాడిన శ్రీకాకుళము, మంగినపూడి, హంసలదీవి బీచ్లు పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయన్నారు..

ఆక్వా ఎక్స్చేంజ్ స్టార్ట్ అప్ కంపెనీ ప్రతినిధి కిరణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తూ 69 వేల ఎకరాల్లో రైతులు తాము అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆక్వా కల్చర్ సాగు చేస్తున్నారన్నారు. పెడన కలంకారి కళాకారుడు శ్రీనివాస్ మాట్లాడుతూ తన పూర్వీకుల నుండి తాను కళను నేర్చుకున్నానని 200 కోట్ల రూపాయల వ్యాపారం చేసేందుకు డిమాండ్ ఉందని సింగపూర్ బృందం సభ్యులకు నిశదీకరించగా బృందం సభ్యులు అతనిని అభినందించారు.

ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట్ర ప్రణాళిక శాఖ సంచాలకులు రాంబాబు, సింగపూర్ బృందం జిల్లా సమన్వయ అధికారి డ్వామా పీడీ శివప్రసాద్, మచిలీపట్నం ఇంచార్జ్ ఆర్డిఓ పోతురాజు, జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆనందకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ సోమ శేఖర్, పంచాయతీరాజ్ ఎస్ ఈ రమణ రావు, డిఎంహెచ్వో డాక్టర్ యుగంధర్, ఐ సి డి ఎస్ పి డి ఎంఎన్ రాణి, డిఆర్డిఏ పిడి హరిహర నాథ్, డిపిఓ అరుణ, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం వెంకటరావు చేనేత జౌళి శాఖ ఏడి సాయి ప్రసాద్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *