అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
1. అమరావతిలో భవన నిర్మాణ కార్మికుల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమం
స్కిల్ డెవలప్మెంట్ & ట్రైనింగ్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన
భవన నిర్మాణ రంగంలో కేవలం స్వల్ప వ్యవధిలోనే ఉచిత శిక్షణ & ఉపాధి పొందే సదవకాశము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC)ద్వారా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC) సంస్థ కల్పించుచున్నది.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్(NAC) వారు APSSDC, APCRDA సంయుక్త ఆధ్వర్యంలో 18 నుంచి 35 సం॥ల వయస్సు గల యువతకు నిర్మాణ రంగమునందు అమరావతిలో 45 రోజుల నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, శిక్షణ అనంతరం ఉపాధి కల్పించేలా శిక్షణ ఇవ్వనున్నారు.
కోర్సు వివరములు:
1. సోలార్ పి.వి. ఇన్‌స్టాలర్(సూర్య మిత్ర) –10వ తరగతి /ఐ.టి.ఐ. /ఇంటర్/డిప్లొమో/ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు
2. జూనియర్ ఎక్స్‌కవేటర్ ఆపరేటర్(జె.సి.బి. డ్రైవర్- చైన్)- 10వ తరగతి / ఐ.టి.ఐ. / ఇంటర్/డిప్లొమో/ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు
3. జూనియర్ జె.సి.బి. డ్రైవర్ (టైర్స్)- 10వ తరగతి/ ఐ.టి.ఐ. / ఇంటర్/డిప్లొమో/ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు
4. కాంక్రీట్ పంప్ ఆపరేటర్- 10వ తరగతి/ ఐ.టి.ఐ. / ఇంటర్/డిప్లొమో పూర్తి చేసినవారు అర్హులు
శిక్షణ ప్రారంభమయ్యే తేదీ:
ఫిబ్రవరి, 20 2026
నాన్ రెసిడెన్షియల్ విధానంలో అందించే ఈ యొక్క ఉచిత శిక్షణలో
1. అడ్వాన్స్డ్ టెక్నాలజీపై శిక్షణ
2. ఉపాధి పొందే విధంగా శిక్షణ కల్పించుట
3. శిక్షణ అనంతరం NCVET / APSSDC వారిచే సర్టిఫికేట్ జారీ చేయబడును.
4. రాజధాని ప్రాంతంలో నిర్మాణ రంగంలో ప్రముఖ కంపెనీలు, పరిశ్రమల యందు ఉపాధి అవకాశాలు కల్పించబడును.
2.ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, విజయవాడ (APBOCWWB) వారు ఉచితంగా అందించే శిక్షణ వివరాలు:
1. అసిస్టెంట్ ఎలక్ట్రిషియన్
2. ప్లంబర్
3. పెయింటింగ్
ప్రతి బ్యాచ్‌కు 30 మందికి పై కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వబడును.
శిక్షణ ప్రారంభమయ్యే తేదీ:
ఫిబ్రవరి, 15 2026
శిక్షణ వ్యవధి: 15 రోజులు
భోజనం: మధ్యాహ్న భోజనం అందించబడుతుంది
వయస్సు: 18 – 45 సంవత్సరాలు
స్టైఫండ్: రోజుకు రూ.300/-
15 రోజులకి మొత్తం రూ.4,500/- స్టైఫండ్ అందించబడుతుంది.
అర్హతలు:
APBOCWWBలో నమోదు అయిన కార్మికులకు మాత్రమే ఈ శిక్షణ ఇవ్వబడుతుంది (చెల్లుబాటు అయ్యే APBOCWWB వర్కర్ ఐడీ కార్డు తప్పనిసరి)
సంప్రదించవలసిన నంబర్లు:
9100107699 / 9966230506 / 8121306680
3. SRM యూనివర్సిటీలో ప్లంబింగ్‌లో ఉచిత శిక్షణ
అమరావతి రాజధాని ప్రాంత నిరుద్యోగ యువతకు ప్లంబింగ్‌లో ఉపాధితో కూడిన ఉచిత శిక్షణ ఇవ్వబడుతుంది. 2 నెలలపాటు ఉచిత శిక్షణ అందించి అనంతరం ఉపాధి కల్పించబడుతుంది. 18-35 సంవత్సరాల వయస్సు కలిగిన అమరావతి రాజధాని ప్రాంత అభ్యర్థులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులు. ఆసక్తి కలిగినవారు గ్రామంలోని APCRDA ఫెసిలిటేటర్‌ను సంప్రదించవచ్చును.
స్టైఫండ్: నెలకు 5,000 రూపాయలు.
అర్హతలు: 8th class /10th / ఇంటర్ / ITI
శిక్షణ పద్ధతి:
* 20 రోజులు తరగతి గది శిక్షణ.
* 40 రోజులు ప్రాక్టికల్ శిక్షణ
* 80% తరగతులు హాజరు అయిన వారికి మాత్రమే స్టైఫండ్, సర్టిఫికెట్ ఇవ్వబడును.
* 20 మందిని మాత్రమే శిక్షణకు తీసుకోబడును.
* పేర్లు నమోదు చేసుకున్న మొదటి 20 మందికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడును.
శిక్షణ కాలంలో లభించు సౌకర్యాలు:
* ఉచిత శిక్షణ
* రవాణా సౌకర్యం
* మధ్యాహ్న భోజనం
ఉద్యోగ అవకాశాలు: శిక్షణ పూర్తి అయిన తరువాత SRM యూనివర్సిటీలో ఇంటర్వ్యూ లు నిర్వహించబడును.
శిక్షణ ప్రదేశం: SRM యూనివర్సిటీ
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 10-02-2026
శిక్షణ తరగతులు ప్రారంభమయ్యే తేదీ: 15-02-2026
4. అమరావతిలో “డిజిటల్ నైపుణ్యాలతో వ్యాపారవేత్తలకు సాధికారత” కార్యక్రమం
SRM యూనివర్సిటీ – ఆంధ్రప్రదేశ్, NiMSME – హైదరాబాద్, APCRDA సౌజన్యంతో అమరావతిలో 5 రోజుల మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(MDP) నిర్వహించబడుతోంది. (శిక్షణ పూర్తిగా తెలుగు భాషలో ఉంటుంది)
శిక్షణ ఇచ్చు అంశం:
“సోషల్ మీడియా & డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వ్యాపార అభివృద్ధి”
స్థానిక వ్యాపారవేత్తలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు సైతం బలమైన ఆధారం. చిన్న వ్యాపారులను ప్రోత్సహించి బలోపేతం చేయడానికి, విజయవాడ పరిసర ప్రాంతాల వ్యాపారవేత్తల కోసం ఈ 5 రోజుల మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్..APCRDA ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించబడింది. శిక్షణకు హాజరైనవారికి స్నాక్స్, మధ్యాహ్న భోజనం అందించబడతాయి.
ఈ కార్యక్రమం లక్ష్యం – విద్యార్హతలు లేకపోయినా మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఉపయోగించి చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను ధైర్యంగా అభివృద్ధి చేసుకునేలా చేయడం.
కార్యక్రమ ముఖ్యాంశాలు:
✔ WhatsApp Businessపై ప్రాక్టికల్ శిక్షణ
✔ Facebook & Instagram ద్వారా వ్యాపార ప్రచారం
✔ ఎక్కువ కస్టమర్లను ఆకర్షించే సులభమైన పద్ధతులు
✔ కంప్యూటర్ అవసరం లేకుండా మొబైల్ ఆధారిత శిక్షణ
✔ పూర్తిగా తెలుగు భాషలో శిక్షణ
✔ శిక్షణ పూర్తి చేసిన వారికి NiMSME – హైదరాబాద్ నుంచి సర్టిఫికెట్ అందించబడును.
ఈ శిక్షణలో ఎవరు పాల్గొనవచ్చు?
* ఇంటి నుంచి చిన్న స్థాయిలో వ్యాపారం నిర్వహిస్తున్న వారు
* చిరు వ్యాపారులు
* SHG సభ్యులు, స్వయం ఉపాధి పొందుతున్న మహిళలు
శిక్షణ జరిగే తేదీలు: 17/02/2026 నుంచి 21/02/2026 వరకు(5 రోజులు)
సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు
స్థలం: SRM యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ – విజయవాడ
ఈ యొక్క ఉచిత శిక్షణ నమోదు & వివరాల కోసం ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన నెంబర్లలో సంప్రదించండి:
అఖిల్: +91 76720 62003, రాజేష్: +91 90008 27670
APCRDA సౌజన్యంతో ఈ నెలలో 4 రకాల ఉచిత శిక్షణ & ఉపాధి కల్పన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ఆసక్తి కల అభ్యర్థులు తమకు నచ్చిన శిక్షణలో చేరవచ్చును. పూర్తి వివరాలకు రాజధాని ప్రాంతవాసులు తమ గ్రామంలోని CRDA ఫెసిలిటేటర్‌ను, అలాగే ఇతర ప్రాంతాలవారు APCRDA లైవ్‌లీహుడ్ స్పెషలిస్ట్ శంకర్‌ను 9848424207 నెంబరులో సంప్రదించవచ్చు.
Prajavartha Online Telugu News