Breaking News

పట్టాభిరామ్ కర్నూలు సమీపంలోని బయోమైనింగ్ సైట్ సందర్శన

కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
కర్నూలు నగరానికి సమీపంలో గార్గేయపురంలోని బయోమైనింగ్ సైట్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ బుధవారం సందర్శించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఆయన పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను అధికారులు పట్టాభిరామ్ కు వివరించారు. ఆంటోనీ లారా కంపెనీ(ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ) ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా, ఈ స్థలాన్ని ఖాళీ చేసి ఆ కంపెనీకి అప్పగించాలని పట్టాభిరామ్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా చైర్మన్ పట్టాభిరామ్ మాట్లాడుతూ, మార్చిలో ఇక్కడ 67,308 మెట్రిక్ టన్నుల వేస్ట్ కోసం టెండర్లు పిలిచామని, మొత్తం డిస్పోజల్ జరిగిందని చెప్పారు. అక్టోబరులో 1,08,000 టన్నుల వేస్ట్ కోసం టెండర్లు పిలవగా, 93,183.85 డిస్పోజల్ జరిగినట్లు తెలిపారు. త్వరలోనే ఇక్కడ ఆంటోనీ లారా కంపెనీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కర్నూలు నగర కమిషనర్ పి.విశ్వనాథ్, ఈఈ గురవప్ప, బయోమైనింగ్ కాంట్రాక్టర్ సౌరాష్ట్ర సంస్థ యజమాని రామిరెడ్డి, ఆంటోనీ లారా కంపెనీ ప్రతినిధి నారాయణ తదితరులు పట్టాభిరామ్ వెంట ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *