Breaking News

శ్రీకాళహస్తీశ్వరస్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం

-ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో శివరాత్రి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆహ్వానించారు. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కి ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కి వేదాశీర్వచనాలు అందించారు. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు పగడాల మురళీ, ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ కి ఆహ్వానం పలికిన వారిలో ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *