విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మా తరతరాలుగా వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. చాలా దారుణం అని గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో చలపతి రావు శృంగేరి పీఠం ఎస్టేట్ ఇంచార్జి శర్మ అన్నారు. జగన్ హిందూ ద్రోహి హిందువులు జగన్ కి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. వేంకటేశ్వరస్వామి కి ద్రోహం చేసినవారూ చరిత్రలో ఎవడు బాగుపడలేదు. శ్రీవారి లడ్డు కల్తీతో హిందువులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. శ్రీవారి ప్రసాదం అంటే హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైనది హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడితే ఎవ్వరు బాగుపడరనీ గతంలో తాగేసిన ఖాళీ మద్యం బాటిల్స్ కొండపై పడవేయడం ఏంటనీ ప్రశ్నించారు. కలియుగ దైవం ఆయనతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు అని తెలిపారు. రాజకీయాలు చేయకుండా భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అందరూ పనిచేయాలని విశ్వనీయ సంస్థల ద్వారా భక్తులకు న్యాయమైన నాణ్యత గల లడ్డూలు అందించాలని కోరారు.
Prajavartha Online Telugu News