Breaking News

భారతీయ జ్ఞాన పరంపర..తెలుగు సాహిత్యం… మొదటి సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్టెల్లా కళాశాల లో తెలుగు శాఖ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారు సంయుక్తం గా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 5 వ తేదీన ఘనంగా ప్రారంభించారు.
ఈ రెండురోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య వేలుదండ నిత్యానంద రావు వైస్ ఛాన్సలర్ సురవరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీ,ఆచార్య కొప్పుల విక్టర్ బాబు వైస్ ఛాన్సలర్ ప్రిన్ కాన్సర్ యూనివర్సిటీ, సౌత్ అమెరికా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు డాక్టర్ కొప్పురం , కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ లేన క్వాడ్రస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఇన్యాసమ్మ తదితరులు ప్రారంభించారు భారతీయ ఙ్ఞాన పరంపర తెలుగు సాహిత్యం అనే అంశం పై మాట్లాడనున్నారని ఈ సదస్సు వల్ల భారతీయ ఙ్ఞాన పరంపర గురించిన అనేక అంశాలు తో అధ్యాపకులు పరిశోధకులు కవులు ఎన్నో విశిష్టమైన పద్ధతులను ,సంప్రదాయాలు లిటరేచర్ సంస్కృతి మొదలగు అంశాలు తెలియ చేశారు.
ఈ రెండు రోజుల సదస్సు లో చర్చనీయాంశాలుగా తెలుగు సాహిత్యం వేదాంతం సంప్రదాయాలు, తెలుగు సాహిత్యం విశిష్టత భాషాభివృద్ధి గా తెలుగు సాహిత్యం తత్వం,మొదలగు అనేక అంశాలుంటాయి ఉంటాయని కళారత్న డాక్టర్ పాలపర్తి శ్రీధర్ గారి చే రచించబడిన శ్రీధర్ శతకం ఆవిష్కరణ తో పాటు 60 కి పైగా పరిశోధన పత్రాలు అందాయని తెలుగు శాఖఅధ్యక్షులు డాక్టర్ వి యన్ మంగ దేవి తెలిపారు.
ఈ సదస్సు డాక్టర్ ధూళిపాళ రామ కృష్ణ సంస్కృత శాఖఅధ్యక్షులు మరియు యు డిగ్రీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సిస్టర్ ఆశ, ఉష కుమారి ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్ స్వప్న వున్నాం, డాక్టర్ వాణి లత ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్, ,డాక్టర్ పద్మలత, స్టూడెంట్ డీన్ ,హిందీ సాఖద్యక్షులు కరుణ హారిక, అధ్యాపకులు , కన్వీనర్ డాక్టర్ శ్రీనివాస్ రావు డాక్టర్ సత్యవేదం,కెప్టెన్ శైలజ చరిత్ర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *