Breaking News

యానాది గిరిజనుల అభివృద్ధి చేయడం లో ప్రభుత్వాలు కృషి చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యానాదులను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కృషి చేయాలని , ఆలిండియా యానాది మహానాడు సంఘం సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మెలిక శ్రీనివాసరావు అన్నారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం యానాదుల్ని అన్ని విధాల ఆదుకుని అభివృద్ధి చేస్తామని నమ్మించి మోసం చేయడమే కాకుండా రాష్ట్రంలో యానాదులపై దాడులు అత్యాచారాలు భూకబ్జాలు చేస్తూ, చిత్రహింసలు గురి చేశారని అన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పై చిలుకు యానాదులు జనాభా కలిగి ఉన్నారని సమాజంలో సామాజికంగా ఆర్థికంగా విద్య, వైద్య, రాజకీయంగా ,వెనుకబడి ఉన్నారని ,యానాదుల అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు కృషి చేయడంలో విఫలం అవుతున్నాయని అన్నారు.

అనంతరం రాష్ట్ర అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని నిర్ణయించి, గత సార్వత్రిక ఎన్నికలలో దాదాపుగా 70 నుండి 80 నియోజక వర్గాలలో యానాది మహానాడు సంఘం కూటమి అభ్యర్థులు గెలుపు కోసం బలంగా పని చేయడం జరిగిందని, ఆయన వివరించారు. గిరిజనులకు యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన యానాది గిరిజనులకు ఒక ఎమ్మేల్సి ఇవ్వాలని, యానాది గిరిజనలందరికి అంత్యోదయ రేషన్ కార్డులు అందిచుట, యానాదులకు వృత్తి పెన్షన్ లేదా 40 సంవత్సరాల నుండి పెన్షన్ వర్తింపు, గిరిజన వర్గీకరణ చేయుట, యానాదుల ప్రమాద భీమా 10 లక్షల చంద్రన్న భీమా ఏర్పాటు చేయడం, మున్సిపాలిటిలో పనిచేసే వర్కర్లను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని, కోరారు. ఈ కార్యక్రమంలో యానాది మహానాడు సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *