Breaking News

ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం–2009లోని సెక్షన్ 12(1)(C) ప్రకారం, 2026–27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని IB / CBSE / ICSE / స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ఉచిత అడ్మిషన్లకు అర్హులైన తల్లిదండ్రుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎస్. సుభాషిణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ అడ్మిషన్లు *ఆర్థికంగా బలహీన వర్గాలు (EWS) / వెనుకబడిన వర్గాలు (BC)*కు చెందిన పిల్లలకు వర్తిస్తాయని, అలాగే వయస్సు, ఆదాయ ప్రమాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలని ఆమె పేర్కొన్నారు.
దరఖాస్తులను http://cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సమీప మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించవచ్చని తెలిపారు.
దరఖాస్తు చివరి తేదీ: 10.03.2026.
అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం మండల విద్యాశాఖ అధికారి లేదా జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయాన్ని సంప్రదించాలని ఎస్. సుభాషిణి తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *