Breaking News

గుంటుపల్లి లో రూరల్ ఇంక్యూబేషన్ స్కిల్oగ్ అండ్ ఎంటర్ప్రేన్యూర్ సెంటర్ ఎన్టీఆర్ వికాస జాబ్ మేళా నిర్వాహణ విజయవంతం..

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), ఎన్టీఆర్ వికాస, జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు శనివారం గుంటుపల్లిలో జాబ్ మేళా” నిర్వహించారు జిల్లా ఉపాధి కల్పన అధికారి సి. మధుభూషణ్ రావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు. ఈ జాబ్ మేళా లో మొత్తం 91 మంది నిరుద్యోగ యువత హాజరు కాగా వారిలో 68 మంది వివిధ ప్రైవేట్ కంపెనీలకు ఎంపికయ్యారు. అలాగే మరో 14 మంది తదుపరి ఇంటర్వ్యూ లకు షార్ట్లిస్ట్ కబడినారు అని తెలియ చేసినారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు డా. జి.లక్ష్మీశ ముఖ్య అతిధిగా పాల్గొని నిరుద్యోగ యువత ప్రభుత్వం, ఎన్టీఆర్ వికాస ద్వారా ఏర్పాటు చేసే జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వికాస మేనేజర్ వoశీ, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, శ్రీనివాస్ రావు, Skill Development Officer, APSSDC, MPDO, Ibrahimpatnam and MRO, Ibrahimpatnam, Ms. Tejwswani, Manager, RISE హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *