-ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల తిరుపతి దేవస్థానం లకు కల్తీ అయింది అనేది వాస్తవమని NDBB తన నివేదికలో స్పష్టంగా వెల్లడించిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను అన్నారు. శనివారం విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, పార్టీ రాష్ట్ర నాయకులు గంజి చిరంజీవి తో కలిసి సామినేని ఉదయభాను మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అపవిత్రం అయిందని తెలిసిన వెంటనే ప్రాయశ్చిత దీక్ష చేపట్టి ప్రముఖ ఆలయాలని సందర్శించి శుద్ధి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. NDBB తన నివేదికలో స్పష్టంగా జంతువుల అవశేషాల ద్వారా కలిసిన కల్తీ నెయ్యినీ టీటీడీకీ విక్రయించారనీ పేర్కొన్నారు. తప్పు చేసి క్షమాపణ అడగకుండా బుకాయించే పరిస్థితికి వైసీపీ పార్టీ దిగజారిందని విమర్శించారు. అసలు డెయిరీ అంటేనే తెలియని వ్యక్తులకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఏ విధంగా ఇచ్చారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీలో అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి నాయకులను ఉపయోగించుకొని సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందన్నారు.
కోట్లాదిమంది హిందువుల మనోభావాన్ని దెబ్బతీసిన పార్టీగా వైసీపీ పార్టీ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. రసాయనాల నెయ్యి ద్వారా లడ్డూలు తయారు చేశామని ఢిల్లీలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టంగా మీడియా సమావేశంలో వెల్లడించారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు, జనసేన పార్టీ కార్పొరేటర్లు మహాదేవ అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, జనసేన పార్టీ నాయకులు ఎస్ ఎల్ ఎన్ మూర్తి, అత్తులూరి పెదబాబు, మద్దిల రామకృష్ణ, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News