Breaking News

పశ్చిమలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం. 12వ రోజు సైకిల్ యాత్ర కార్యక్రమం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది. శనివారం యాత్ర 17 కిలోమీటర్ల మేరకు యాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకు 142 కిలోమీటర్లు యాత్రను కొనసాగించారు. శివాలయం సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఈగల్ ఐ.జి. ఆకే రవి కృష్ణ, ట్రాఫిక్ డి.సి.పి.షిరిన్ బేగం, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్. టీడీపీ నేతలు నాగుల్ మీరా, బుద్దా వెంకన్న ముఖ్య అతిధులుగా పాల్గొని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ ర్యాలీ కుమ్మరిపాలెం నుండి నాలుగు స్థంబాల సెంటర్, చెరువు సెంటర్ మీదుగా జి.ఎన్.ఆర్ స్కూల్, సీతారా జంక్షన్, కాబేలా, ఊర్మిళా నగర్, చర్చ్ సెంటర్ మీదుగా శివాలయం సెంటర్, స్వాతి, గొల్లపూడి, గొల్లపూడి పంచాయతీ ఆఫీసు వరకు సాగింది. చెరువు సెంటర్ వద్ద గతంలో గంజాయి బానిసై ఇప్పుడు మార్పు చెందిన ఇద్దరు యువకులు డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనే నినాదంతో ఎవ్వరూ డ్రగ్స్ కి బానిసవ్వకూడదు అని అందరూ మారాలి అని సందేశం ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్, అధిక సంఖ్యలో అధికారులు, స్థానిక నేతలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నా రు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *