Breaking News

డెంటల్, ఆయుష్ కోర్సుల్లో 76.17%-85% సీట్లు అమ్మాయిలకే..!

-కన్వీనర్, యాజమాన్య కోటాలోనూ వీరిదే హవా
-2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల తీరిది
-ముగిసిన ప్రవేశాలపై మంత్రి సత్య కుమార్ కు నివేదించిన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యూజీ వైద్య విద్యలోని అన్ని కోర్సుల్లో అమ్మాయిలే అధిక శాతం సీట్లు దక్కించుకున్నారు. డెంటల్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో అమ్మాయిల శాతం 76.17% నుంచి 85% మధ్య నమోదైంది ఎంబీబీఎస్ లో సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 60.72% మంది ఉన్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో వైద్య విద్యలోనికి ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ద్వారా జరిగిన ప్రవేశాల తీరును విశ్లేషించినప్పుడు సీట్లు దక్కించుకోవడంలో అమ్మాయిల మధ్యన పోటీ ఎక్కువగా కనిపించింది. ఈ వివరాలను విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు నివేదించారు. అందులో పేర్కొన్న ప్రకారం కన్వీనర్ కోటాలోనే కాకుండా యాజమాన్య కోటాలోని సీట్లను కూడా అమ్మాయిలే అత్యధికంగా దక్కించుకున్నారు. ఎంబీబీఎస్ లోని సీట్లు రాని వారు బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో చేరేందుకు ప్రాధాన్యమిచ్చారు. వైద్య విద్యను అభ్యసించేందుకు అమ్మాయిలు పాఠశాల విద్య నుంచే సన్నద్ధమవుతూ ఎక్కువ సీట్లు దక్కించుకుంటున్నారు. ఈ విషయం మరోమారు 2025-26 ప్రవేశాల ద్వారా కూడా స్పష్టమైంది.

అన్నింట్లో వారే !
బీడీఎస్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలిపి ఉన్న 1,519 సీట్లకు 1,157 (76.17%) సీట్లను అమ్మాయిలు దక్కించుకున్నారు. కన్వీనర్ కోటాలో 76.31%, యాజమాన్య కోటాలో 76.09% చొప్పున సీట్లు వీరికి లభించాయి.

-హోమియో: మొత్తం ఉన్న 526 సీట్లలో 380 (83.70%) అమ్మాయిలు పొందారు. కన్వీనర్ కోటాలో 83.33%, యాజమాన్య కోటాలో 85% చొప్పున సీట్లు పొందారు

-ఆయుర్వేద:98 సీట్లలో 74 అమ్మాయిలు (75.51%) దక్కించుకున్నారు.

-యూనాని: 42 సీట్లలో 34 సీట్లు (85%) అమ్మాయిలు దక్కించుకున్నారు.

*ఎంబీబీఎస్ లోని మొత్తం సీట్లలో 60.72% అమ్మాయిలు దక్కించుకున్నారు. కన్వీనర్, యాజమాన్య కోటాలోని సీట్లు పొందడంలో వీరే ముందున్నారు. 2024-25లో ఇంచుమించు ఇలాగే ప్రవేశాలు జరిగాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆరోగ్య వాసిడి ద్వారా జరుగుతున్న పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో mbbs అమ్మాయిలు ముందుంజలో కనిపిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *