Breaking News

మహిళల శక్తితోనే అభివృద్ధి డ్వాక్రా రూపకర్త చంద్రబాబు

-రేషన్ మాఫియాను అరికట్టాలి
-డ్వాక్రా సమావేశంలో గద్దె అనురాధ, గద్దె రామమోహన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి మూలమని, అందుకే మహిళలను అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వాములుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన అజెండాగా పనిచేస్తోందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం 12వ డివిజన్ పరిధిలోని డ్వాక్రా మహిళలు, బుక్ కీపర్లతో కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు ఆధ్వర్యంలో అశోక్ నగర్ లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పాల్గొని మహిళల సమస్యలు, అవసరాలను నేరుగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టిన దూరదృష్టి గల నాయకుడు చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన అనే చిన్న విత్తనం నాటిన చంద్రబాబు ఆలోచన, నేడు కోట్లాది మహిళలకు జీవనాధారంగా మారిన మహా వృక్షంగా విస్తరించిందని ఆమె పేర్కొన్నారు. మహిళలను కేవలం పథకాల లబ్ధిదారులుగా పరిమితం చేయకుండా, స్వయం ఉపాధి, వ్యాపారాలు, పరిశ్రమల వైపు నడిపించిన చరిత్ర చంద్రబాబుదేనని గద్దె అనురాధ తెలిపారు. ప్రతి ఇంట్లో మహిళ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలన్నదే చంద్రబాబు ఆలోచనకు కొనసాగింపుగా నేటి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు సంఘటితంగా ముందుకు వస్తే ఆర్థిక స్వావలంబన సాధ్యమని, అందుకే తక్కువ వడ్డీకే రుణాలు, వ్యాపార అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయం, మార్కెటింగ్ అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న రేషన్ బియ్యం అత్యంత పౌష్టికంగా, నాణ్యంగా ఉంటాయని తెలిపారు. అలాంటి విలువైన రేషన్ బియ్యాన్ని కొందరు మాఫియా దళారులకు అమ్మి రేషన్ మాఫియాకు సహకరించడం అత్యంత తప్పని, ఇది ప్రభుత్వానికి కాదు – నేరుగా పేద కుటుంబాలకే నష్టం చేస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఉచితంగా లేదా తక్కువ ధరకు అందిస్తున్న బియ్యాన్ని కొందరు మధ్యవర్తులు సేకరించి, మళ్లీ అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తూ అక్రమ లాభాలు పొందుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలకు డ్వాక్రా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వాములు కావద్దని స్పష్టంగా సూచించారు. రేషన్ మాఫియాపై కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేస్తున్నా, అమ్ముతున్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్వాక్రా సంఘాలు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారాయని, మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాదిగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన మహిళలకు చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, డ్వాక్రా సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పొట్లూరు సాయిబాబు, అబ్దుల్ కరీం, శాయన సత్యనారాయణ, మేదరమెట్ల నారాయణ, అబ్దుల్ ఖాలీక్, జక్కుల సుబ్బారావు, బాలు, మాదల చిన్నతల్లి, కోడె సాంబశివరావు, రంగారావు, బాజీ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *