Breaking News

గుంటూరులో తాగునీటి సరఫరాలో అంతరాయం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఫిబ్రవరి 9 (సోమవారం) సాయంత్రం నుండి ఫిబ్రవరి 10 (మంగళవారం) వరకు గుంటూరు నగరంలో తాగునీటి సరఫరాలో అంతరాయం. మంగళవారం సాయంత్రం పాక్షికంగా, బుధవారం ఉదయం నుండి యధావిధిగా సరఫరా జరుగుతుంది. తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ నుండి నీటిని పంపింగ్ చేసే లైనుపై, సీతానగర్ వద్ద లీకేజీ ఏర్పడింది. నీటి వృధాను అరికట్టడానికి, ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీనివలన ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలిపివేయబడుతుంది. నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు: “తక్కెళ్ళపాడు హెడ్ వాటర్ వర్క్స్ పరిధిలోని నెహ్రునగర్, శారదకాలనీ, వసంతరాయపురం, రాజీవ్ గాంధీ నగర్, హనుమయ్యనగర్, స్తంబాలగరువు, శ్యామలనగర్, గుజ్జనగుండ్ల, కోర్ట్ కాంపౌండ్, ఏటి అగ్రహారం, నల్ల చెరువు, బిఆర్ స్టేడియం, శ్రీనివాసరావు తోట మరియు తారకరామనగర్, నల్లచెరువు, బిఆర్ స్టేడియం, శ్రీనివాసరావు తోట రిజర్వాయర్ల రిజర్వాయర్ల ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.” నగర ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించి, ముందుగానే తమకు కావలసిన నీటిని నిల్వ చేసుకోవాలని మరియు నగరపాలక సంస్థకు సహకరించాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *