అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 19వతేది మంగళవారం ఉ.11గం.లకు రాష్ట్ర శాసన సభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ అసెంబ్లీలోని కమిటీలో సమావేశం కానుందని రాష్ట్ర శాసన సభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు తెలియజేశారు.జంగా కృష్ణమూర్తి అధ్యక్షులుగా మరో 10మంది సభ్యులతో కూడిన రాష్ట్ర శాసనసభా వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ 19న అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమై రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలు తీరును,బిసి వర్గాలకు అమలు చేస్తున్నరూల్ ఆఫ్ రిజర్వేషన్ల అమలుతీరును ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో కమిటీ సమీక్షిస్తుందని తెలిపారు.ఈనెల 20వతేది రాత్రి రైలులో ఈకమిటీ తిరుపతి బయలుదేరి వెళ్ళి ఈనెల 21,22తేదీల్లో తిరుపతిలో పర్యటించనుందని ఆయన తెలియజేశారు.
Tags amaravathi
Check Also
నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”
-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …
Prajavartha Online Telugu News