గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం కలెక్టరేట్ లోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ( పీజీ ఆర్ఎస్) రెవెన్యూ, నాన్ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు 217 అర్జీలను అందించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాసులు, జిల్లా పరిషత్ సీఈవో వి జ్యోతి బసు, డ్వామా పీడీ శంకర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరించాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు అందించారు. పీజీఆర్ఎస్ లోని రెవెన్యూ క్లినిక్ లో జిల్లా లోని 18 మండలాల తహసీల్దార్లు రెవెన్యూ అంశాల అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగిన పీ.జీ.ఆర్ఎస్ కు 217 అర్జీలు, తెనాలి డివిజన్ స్థాయికి సంబంధించి 12, గుంటూరు డివిజన్ స్థాయికిసంబంధించి 9, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు 53 అర్జీలు మొత్తం జిల్లాలో 291 అర్జీలు అందాయి. ప్రజలు అందించిన అర్జీలను సత్వర మే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ సూచించారు. అదే వధంగా జిల్లాలో ప్రభుత్వ శాఖలకు సంబంధించి డార్మెంటరీ లో ఉన్న బ్యాంక్ అకౌంట్లను సంబంధిత శాఖల డీడీఓలు ఈకేవైసీ చేసి వెంటనే యాక్టివ్లోకి తీసుకురావాలని సూచించారు. కార్యాలయాల్లోని అన్ని ఫైళ్లను ఈ పి టి ఎస్ లో నమోదు ప్రక్రియను నూరు శాతం వెంటనే పూర్తి చేయాలి అన్నారు.
పీజీఆర్ఎస్ లో ప్రజలు వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్జీల వివరాలు
గన్నవరం కు చెందిన డి నాగలక్ష్మి మంగళగిరిలో టిడ్కో హౌసింగ్ కి నగదు చెల్లించాలని ఇప్పటివరకు ఇల్లు కేటాయించలేదని అర్జీ అందించారు.
గుంటూరు శ్రీనగర్ కాలనీకి చెందిన మద్దాల వెంకటేశ్వర్లు ఇంటి నిర్మాణానికి గృహ నిర్మాణ పథకం ద్వారా నిధులు మంజూరు చేయాలని అర్జీ అందించారు.
దగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కాశీం పీరా బ్యాంకు రుణం చెల్లించటానిక మూడు నెలల వ్యవధి ఇప్పించాలని కోరుతూ అర్జీ అందించారు.
* గుంటూరు నల్ల చెరువుకు చెందిన జక్కా నవీన్ కుమార్ తాను రూ. 10 లక్షలతో కొనుగోలు చేసిన ఇంటిని అమ్మినవారు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందించారు.
* మంగళగిరి మండలం నవులూరు కి చెందిన షాహీదా వితంతు పెన్షన్ మంజూరు చేయాలని అర్జీ అందించారు
* తెనాలి స్వరాజ్ థియేటర్ సమీపంలో డ్రైనేజ్ కాలువపై షాపు నిర్మిస్తున్నారని వాటిని తొలగించాలని పలువురు అర్జీ అందించారు.
* దుగ్గిరాల చిలువూరుకు చెందిన షేక్ నాగులా బంధువుల వద్ద రూ.1,50,000 అప్పు తీసుకొని వడ్డీతో సహా తిరిగి చెల్లించిన మరల నగదు చెల్లించాలని నోటీసులు పంపించారు. న్యాయం చేయాలని కోరుతూ అర్జీ అందించారు.
* తుళ్లూరు బోరుపాలెం కు చెందిన సీహెచ్ చంద్రశేఖర్ ఇంటి పన్ను అసెస్మెంట్ చేయాలని అర్జీ అందించారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ విజయలక్ష్మి, డీఈఓ సలీం భాషా, ఐసీడీఎస్ పీడీ ప్రసునా, డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, ఆర్టీవో శ్రీహరి, లీడ్ బ్యాంకు మేనేజర్ మహిపాల్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడీఎ సత్యన్నారాయణ, డీపీఓ సాయికుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News