బిల్ గేట్స్‌కు సీఎం చంద్రబాబు ఆత్మీయ స్వాగతం

-హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? అంటూ సీఎం చంద్రబాబును పలకరించిన బిల్ గేట్స్
-మంత్రులను బిల్ గేట్స్‌కు పరిచయం చేసిన సీఎం చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ..? ఇదీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి బిల్ గేట్స్ పలకరింపు. సోమవారం ఏపీలో పర్యటించేందుకు వచ్చిన గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. చంద్రబాబును చూడగానే.. బిల్ గేట్స్ ఆత్మీయంగా పలకరించారు. హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ అంటూ సీఎం చంద్రబాబును బిల్ గేట్స్ అడిగారు. ఆ తర్వాత తన మంత్రివర్గ సహచరులను, సీఎస్ విజయానంద్‌ను బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో బిల్ గేట్స్‌ను మంత్రి నారా లోకేష్ రిసీవ్ చేసుకున్నారు. విమానాశ్రయం వద్ద బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన బృందంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

-ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్నాం -బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *