వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉండవల్లిలోని వ్యవసాయక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు. అక్కడ ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో అవలంభిస్తున్నఏఐ సహా ఇతర సాంకేతిక విధానాల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు. డ్రోన్ల సాయంతో పంటల్లో చీడపీడలు నివారిస్తున్న తీరును స్వయంగా పొలంలోకి వెళ్లి గేట్స్ తిలకించారు. అనంతరం అక్కడ రైతులతో బిల్ గేట్స్ ముఖాముఖి చర్చించారు. వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ముఖ్యమంత్రికి, బిల్ గేట్స్‌కు మహిళా రైతులు స్వాగతం పలికారు. వారు వండి తీసుకుచ్చిన స్థానిక వంటలను బిల్ గేట్స్ రుచి చూశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

-ప్రజా సాధికారత, సంపద సృష్టి లక్ష్యంగా పనిచేస్తున్నాం -బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -స్వర్ణాంధ్ర లక్ష్యాలు, పాలనా విధానాలపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *