Breaking News

విశాఖపట్నంలో ‘సండే ఆన్ సైకిల్’

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న Fit India Movement కార్యక్రమంలో భాగంగా, ‘సండే ఆన్ సైకిల్’ 63వ ఎడిషన్ ను పురస్కరించుకుని ఆర్కే బీచ్, విశాఖపట్నం వద్ద ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ఈ ర్యాలీలో క్రీడా అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని “ఫిట్నెస్ ఫర్ ఆల్” అనే సందేశాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. కార్యక్రమం ఫిట్ ఇండియా ఉద్యమ నినాదమైన “ఫిట్నెస్ పర్ ఆల్”ను పునరుద్ఘాటిస్తూ, ప్రతి పౌరుడు ఆరోగ్యకరమైన మరియు చురుకైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని ప్రేరణనిచ్చింది.
ఈ కార్యక్రమానికి అనిమిని రవినాయుడు, శాప్ చైర్మన్, ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అలాగే ఎమ్మెల్యే & గవర్నమెంట్ విప్ PGVR Naidu (గణబాబు), ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే Vishu Kumar Raju కార్యక్రమానికి హాజరై పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో Sports Authority of India (SAI) డైరెక్టర్ హరిష్ బాబు, SAI ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జ్  సత్యనారాయణ, డీఎస్ఈఓ, డీఎస్ఏ, విశాఖపట్నం తదితర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు శారీరక దృఢత్వం, నిత్యవ్యాయామం మరియు పర్యావరణ హితమైన రవాణా మార్గమైన సైక్లింగ్ ప్రాముఖ్యతను వివరించారు. ముఖ్యంగా యువత ఫిట్ ఇండియా ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిరోజు వ్యాయామాన్ని అలవాటు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ విజయవంతంగా నిర్వహించబడగా, క్రీడా అధికారులు, సిబ్బంది మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొని “పిటెనెస్ ఫర్ ఆల్” సందేశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం ఫిట్ ఇండియా సైకిల్ ర్యాలీ లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తూ ప్రతి పౌరుడిని ఆరోగ్యంపై దృష్టి పెట్టేలా ప్రేరేపించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *