Breaking News

మన నగరం సుందరంగా పరిశుభ్రంగా ఉండాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన నగరం ఎల్లప్పుడూ సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆదివారము ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్ పటమట బెంజ్ సర్కిల్ హైవే ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉండాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రోడ్డుపైన గుంతలు పడితే, వెంటనే ప్యాచ్ వర్క్లు చేయాలని, నగర సుందరీకరణంలో ఏవైనా లోపాలు కనిపించినచో వెంటనే సుందరీకరణ పనులు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని, నగరం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉండుటకు పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా గేటట్టు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, రహదారుల్లో అనధికార బ్యానర్లు లేకుండా తొలగిస్తుండాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *