-సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్)లో మాత్రమే కాకుండా “మీకోసం” వెబ్ సైట్ లోను ఆన్ లైన్ లో ప్రజలు అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పి.జి.ఆర్.ఎస్ తో పాటు నిర్వహిస్తున్న
రెవెన్యూ క్లినిక్ లను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ లను ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రెవెన్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. రెవిన్యూ క్లినిక్ లలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, గుంటూరు, తెనాలి రెవిన్యూ డివిజనల్ అధికారులు గ్రామ స్థాయి రికార్డులతో హాజరు అవుతారని తెలిపారు. మండలాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అప్పటికప్పుడే పరిష్కారం చేయలేని సమస్యలను వారం రోజులలో పరిష్కారం చేయుటకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను డివిజనల్, మండల రెవిన్యూ అధికారులు సమర్పిస్తామని వివరించారు.
రెవెన్యూ క్లినిక్ కు నాలుగు కౌంటర్ లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు.
మీకోసం వెబ్ సైట్ లో ఆర్జీలు సమర్పించవచ్చు
ప్రజలు తమ సమస్యలను మీకోసం వెబ్ సైట్ లోను అర్జీలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పారు. అర్జీల వివరాలు
Meekosam.ap.gov.in
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. పి.జి.ఆర్.ఎస్ లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. అర్జీలను మీకోసం వెబ్ సైట్ లోను సమర్పించవచ్చని చెప్పారు.
Prajavartha Online Telugu News