Breaking News

టీటీడీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలి… : మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు, మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో బి.ఆర్ నాయుడుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడంతో హిందూ సమాజం తీవ్ర ఆందోళనకు గురైందన్నారు. ఇటువంటి వివాదాస్పద పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కొనసాగించడం సరైంది కాదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిజంగా శ్రీవారిపై భక్తి భావం ఉంటే ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో ఎస్వీబీసీ భక్తి ఛానల్‌కు సంబంధించిన వివాదంలో వెంటనే చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఎలాంటి అపరాధ భావం లేకుండా వైఎస్సార్ సీపీపై నిందలు మోపడం అనైతికమన్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకు మద్దతుగా సమావేశాలు నిర్వహించిన స్వామీజీలు ఈ అంశంపై స్పందించాలని కోరారు. బి.ఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆలయ పవిత్రత దెబ్బతినేలా వ్యవహారాలు జరుగుతున్నాయని పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు. 70 ఏళ్ల వయస్సులో ఉన్న చైర్మన్‌కు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *