Breaking News

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆశ‌యాల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడుతున్న నాయ‌కుడు ఎంపీ కేశినేని శివనాథ్

-ప్ర‌తి ఇంటి నుంచి ఒక మ‌హిళా ఎంటర్ ప్రెన్యూర్ గా రాణించాలన్నదే ఎంపీ కేశినేని శివనాథ్ లక్ష్యం :
-ఎన్టీఆర్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య వెల్ల‌డి
-ఇబ్ర‌హీంప‌ట్నంరింగ్ సెంట‌ర్ నుంచి 45 మంది మ‌హిళ‌ల‌తో హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి బ‌య‌లుదేరిన బ‌స్సు
-జెండా ఊపి బస్సు ప్రారంభించిన చెన్నబోయిన , జంపాల
-కేశినేని ఫౌండేషన్ , ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో ఎన్.ఐ.ఆర్.డి లో ఐదు రోజుల శిక్షణ
-మ‌ష్రూమ్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై శిక్ష‌ణా కార్య‌క్ర‌మం
-మార్చి 2వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వ‌ర‌కు 5 రోజుల శిక్ష‌ణా కార్య‌క్ర‌మం

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా లో అర్బన్ ప్రాంత, రూరల్ నియోజకవర్గాల మండలాలకు చెందిన ఎస్.హెచ్.జి మహిళలతో పాటు ప్రతి మహిళ ఎంటర్ ప్రెన్యూర్ తయారై రాణించాలనే లక్ష్యంతో ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో కేశినేని ఫౌండేషన్ ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా టిడిపి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య అన్నారు.

ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో మార్చి 2వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వ‌ర‌కు ఐదు రోజలు పాట నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందే 45 మంది మహిళలతో ప్ర‌త్యేక బ‌స్సు ఆదివారం ఇబ్రహీం పట్నం రింగ్ సెంటర్ నుంచి బయ‌లు దేరింది. హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డికి బ‌యలుదేరిన ఈ బ‌స్సుకు ఇబ్రహీం పట్నం రింగ్ సెంటర్ నందు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు , టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య స్థానిక నాయకులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

ఎన్.ఐ.ఆర్.డి లో 12వ నైపుణ్యాభివృద్ధి శిక్ష‌ణా కార్య‌క్ర‌మంలో భాగంగా ఐదు రోజుల శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన 45 మంది ఎస్.హెచ్.జి మహిళలకు మ‌ష్రూమ్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై శిక్షణ ఇస్తారు. ఎన్టీఆర్ జిల్లాలోని రూరల్ నియోజ‌క‌వ‌ర్గాలైన నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట‌, మైల‌వ‌రం, తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన 45 మంది ఎస్.హెచ్.జి మహిళలను ఎంపీ కేశినేని శివ‌నాథ్ త‌న సొంత నిధుల‌తో నైపుణ్యాభివృద్ది శిక్షణకు పంపించ‌టం జ‌రిగింది. మ‌ష్రూమ్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ త‌యారీ విధానం పై శిక్షణ త‌ర‌గ‌తులు హైద‌రాబాద్ ఎన్.ఐ.ఆర్.డిలో సోమ‌వారం నుంచి ప్రారంభం అవుతాయి.

ఈ సందర్భంగా కొండపల్లి చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి వల్ల ఎస్.హెచ్.జి మహిళలజీవితాల్లో వారి జీవనోపాధి మెరుగుపర్చుకునేందుకు చక్కని అవకావం లభించిందన్నారు. గ‌త ఏడాది కాలం నుంచి ఎంపీ కేశినేని శివ‌నాథ్ సుమారు 500 మ‌హిళ‌ల‌కు ఎన్.ఐ.ఆర్.డి లో ప‌లు స్వ‌యం ఉపాధిగా చేసుకునే ప‌లు ఉత్పత్తుల త‌యారీకి సంబంధించి శిక్ష‌ణ ఇప్పించ‌టం జ‌రిగింద‌న్నారు. మహిళల సాధికారికత, ఆర్థిక స్వాలంబన కోసం ఎంపీ కేశినేని శివనాథ్ త‌న సొంత నిధుల‌తో కేశినేని ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నారని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయన్నారు. మ‌ష్రూమ్స్, హోమ్ బేస్ట్ ప్రొడ‌క్ట్స్ తయారీ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయని పేర్కొన్నారు.

టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జంపాల సీతారామయ్య మాట్లాడుతూ మహిళలు సాధికారత, స్వయం సమృద్ధి సాధించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో కేశినేని ఫౌండేషన్ ఎస్.హెచ్.జి మహిళలకు చేయూతగా నిలుస్తుందన్నారు. ఇంటికి ఒక పారిశ్రామిక వుండాల‌న్న‌ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశయానికి ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఆచ‌ర‌ణ‌లో పెట్టాడ‌ని కొనియాడారు.. జిల్లాలో ప్ర‌తి ఇంటి నుంచి ఒక మ‌హిళా పారిశ్రామిక వేత్త త‌యారు కావాల‌న్న‌దే ఎంపీ కేశినేని శివ‌నాథ్ ల‌క్ష్యమ‌న్నారు. శిక్ష‌ణ పొంది వ‌స్తువులు ఉత్ప‌త్తి చేస్తున్న మ‌హిళ‌ల‌తో ఎంపీ కేశినేని శివ‌నాథ్ స్వ‌యంగా మాట్లాడర‌ని, వారి కోసం కామ‌న్ ఫెసిలిటీ సెంట‌ర్స్ కూడా ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌హిళ‌ల‌ జీవనోపాధి మెరుగుదల కోసం ఇలాంటి శిక్షణ గత పదేళ్లలో ఏ నాయకుడు ఇప్పించలేదన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యనిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి జంపాల సీతారామ‌య్య‌, ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, స‌హ‌కార సంఘ కో-ఆప‌రేటివ్ బ్యాంక్ అధ్య‌క్షులు కోయ నెహ్రూ, కౌన్సిల‌ర్ పులిదాసు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొత్త‌పల్లి ప్ర‌కాష్, ఎస్టీ నాయ‌కులు మేడా శ్రీను, మున్సిపల్ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ మాబు సుభాని లతో పాటు స్థానిక ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *