Breaking News

సేవాభారతి సేవలు అభినందనీయం..

-సమాజ సేవలో అందరూ భాగస్తులు కావాలి..
-బాల సమ్మేళనంలో పిలుపునిచిన అతిథులు..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ సేవను అందరి బాధ్యత గా గుర్తించాలని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.. సేవా భారతి విజయవాడ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కాలనీ లోని వెన్యూ కన్వెన్షన్ లో బాల మేళా కార్యక్రమం నిర్వహించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజనా చౌదరి మాట్లాడుతూ.. నగరంలోని బస్తీ లలో,మారు మూల ప్రాంతాల్లో నివసించే పేద పిల్లలకు విద్యాభ్యాసంలో, సామాజిక , సాంస్కృతిక అంశాలలో సేవాభారతి తర్ఫీదు ఇవ్వడం అభినందనీయమన్నారు. అన్ని దానాలలో విద్యా దానమే గొప్పదని భావించి.. సేవా భారతి చేసే శ్రమదానం చాలా హర్షణీయమని చెప్పారు. యువత మాదకద్రవ్యా ల జోలికి పోకుండా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.. చిన్నతనం నుంచే పిల్లలు సమాజ సేవ అలవర్చుకునేలా సేవా భారతి శిక్షణ ఇవ్వాలని కోరారు.. సంప్రదాయాలు, మానసిక వికాసం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
విశిష్ట అతిథి గా విచ్చేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ పిల్లలలో మంచి సంస్కారాలు నేర్పుతున్నటువంటి సేవా భారతికి అభినందనలు తెలిపారు. ప్రధానంగా పిల్లలు తల్లితండ్రులను గౌరవించడం , గురువుకి ప్రాధాన్యత ఇవ్వడం అలవేర్చుకోవాలని పిలుపు నిచ్చారు.. సేవా భారతి చేసేటువంటి సేవా కార్యక్రమాలు అందరికి ఆదర్శనీయమని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఏపీ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు మాట్లాడుతూ.. సమాజ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు.. సేవా భారతి సంస్థ 44 ట్యూషన్ సెంటర్లలో 1000 మంది పిల్లలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు .. ఈ సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.. విజయవాడలోని 44 సేవా బస్తీలలో ,గుంటూరు ,పెద్దనందిపాడు,బాపట్ల,ఏలూరు,మచిలీపట్నం,కృతివెన్ను,జగ్గయ్యపేట,నూజివీడు చుట్టు పక్కల గ్రామాలలో జరిగే మన 126 అభ్యాసికలలో 4196 బాల బాలికలు విద్యను అభ్యసిస్తున్నారనీ సేవా భారతి నిర్వాహకులు తెలిపారు.. కార్యక్రమంలో పిల్లల యొక్క సాంస్కృతి కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో భాగంగా అతిథులను ఘనంగా సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నెల్లూరు జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి వినూత్న విధానం – “వన్ మంత్, వన్ విలేజ్, ఫోర్ విజిట్స్”

-కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో నెల్లూరు మోడల్‌కు సీఎం చంద్రబాబు నాయుడు ప్రశంసలు -కలెక్టర్ హిమాన్షు శుక్లను ప్రత్యేకంగా అభినందించిన సీఎం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *